Breaking News

కాళేశ్వరం పునరుద్ధరణలో కాంగ్రెస్ విఫలం.. రాంచందర్‌ రావు

Published on Sun, 07/12/2026 - 16:27

సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం మూడు బ్యారేజీల పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ఆలస్యంతో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ రోజు (ఆదివారం) కాళేశ్వరం ప్రాజెక్టు అంశమై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. NDSA సిఫారసులను సకాలంలో అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం చెందిందని  2024, 2025, 2026లో మూడు పూర్తి వర్కింగ్ సీజన్లు ఉన్నా పునరుద్ధరణ పనులు పూర్తి చేయలేదన్నారు.

రాంచందర్‌ రావు లేఖలో "200 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయింది. NDSA ఇప్పటికే సమగ్ర పరీక్షలు, సాంకేతిక పరిశీలనలు, పునరుద్ధరణ చర్యలు సూచించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సాంకేతిక మార్గదర్శకత్వానికేనని, అమలు బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే NDSA కమిటీపై బాధ్యత నెట్టడం ద్వారా సీఎం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారుఅన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తక్కువ నష్టం జరిగిందని, వాటిని ముందే పునరుద్ధరిస్తే ఉత్తర తెలంగాణకు నీరు అందేది. 20–25 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణకు తాగునీరు అందించే అవకాశం కోల్పోయింది." అన్నారు.

విజిలెన్స్ కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని, విజిలెన్స్ నివేదికలో సూచించిన వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం హైకోర్టులో సమర్థంగా వాదించలేదు.బీఆర్ఎస్ పెద్దలను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. CBI విచారణకు కేవలం మూడు బ్యారేజీల అంశానికే పరిమితమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారన్నారు. రూ.1.30 లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని.. పంప్ హౌస్‌లు, కాల్వలు, టన్నెల్లు, రిజర్వాయర్లు సహా మొత్తం ప్రాజెక్టుపై CBI విచారణ జరగాలని రాంచందర్‌ రావు లేఖలో పేర్కొన్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)