Breaking News

సర్కార్‌పై సమరానికి సై!

Published on Sat, 10/05/2024 - 06:05

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సర్కారుపై సమరానికి ‘కమల దళం’సై అంటోంది. ఆరు గ్యారంటీలు, రైతులు, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీసేందుకు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు అంశాలపై ఆందోళనలు, నిరసనలు ప్రారంభించగా.. విస్తృతస్థాయిలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పోరాటాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.

హైడ్రా, మూసీ అంశాలపై..
‘హైడ్రా’ కూల్చివేతలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో క్షేత్రస్థాయిలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్‌ చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ‘హైడ్రా’ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా 2, 3 రోజుల్లో కార్యాచరణను ఖరారు చేయాలని.. ఇందిరాపార్కు వద్ద ధర్నా, ఇతర రూపాల్లో ఆందోళనలు నిర్వహించడం ద్వారా పేదల పక్షాన బీజేపీ నిలుస్తోందనే భరోసాను కల్పించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

ఇటీవల బీజేపీ చేపట్టిన 24 గంటల రైతుదీక్షకు మంచి స్పందన వచ్చిందని.. దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొనడంతో వారి మధ్య సమన్వయం పెరిగిందని అంటున్నారు. ఇది కలసివచ్చే అంశమని చెప్తున్నారు. 

ఇక స్థానిక సంస్థల సమస్యలు, పెండింగ్‌ బిల్లులపై నిరసనలు, ఆందోళనలను ప్రారంభించినా.. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు, పంచాయతీలు, మండలాల్లో నిధుల లేమి తదితర అంశాలపై భారీగా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

‘కొత్త’ కాంబినేషన్‌తో ముందుకు!
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్, పార్టీ శాసనసభాపక్ష (బీజేఎల్పీ) నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఇతర నాయకులు ఓ టీమ్‌గా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస కార్యక్రమాలు చేపడుతుండటం కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోందని పార్టీ నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ఈ ఇద్దరు నేతలు పార్టీలో కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నారా? అనే చర్చ సాగుతోందని పేర్కొంటున్నారు. 

ఈ ఇద్దరు చొరవగా> అసెంబ్లీలోని కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశాన్ని నిర్వహించి.. ప్రజాప్రతినిధులు, నేతల మధ్య సమన్వయం, సయోధ్య సాధించడంలో విజయం సాధించారని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ధర్నాచౌక్‌ వద్ద నిర్వహించిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష కూడా విజయవంతం కావడం ‘కొత్త’ కాంబినేషన్‌కు మరింత కలసి వచ్చిందని అంటున్నారు. 

దీనిని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు.. హైడ్రాతో పేదలకు ఎదురవుతున్న ఇబ్బందులు, గ్రామీణ స్థానిక సంస్థల్లో నిధుల లేమి, సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడంపై నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారని పేర్కొంటున్నారు.

దూకుడు పెంచిన నేతలు..
జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా బిజీగా ఉన్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇటీవల ‘హైడ్రా’, మూసీ కూల్చివేతలపై తీవ్రంగా స్పందించారు. పేదల జోలికొస్తే కాంగ్రెస్‌ సర్కార్‌ పతనాన్ని శాసిస్తామంటూ హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి సంచలన ఆరోపణలతో అందరి దృష్టిని ఆకర్షించారు. 

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని చెరువుల పరిధిలో పేదలు, మధ్యతరగతి వర్గాల ఇళ్లను కూల్చడంపై ఎంపీ ఈటల రాజేందర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ, క్షేత్రస్థాయిలో బాధిత ప్రజలను కలసి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. 

గ్రామాల్లో తమ సొంత డబ్బులతో చేపట్టిన పనులకు ఇంకా బిల్లులు చెల్లించలేదంటూ మాజీ సర్పంచ్‌లు చేస్తున్న ఆందోళనకు ఈటల మద్దతిచ్చారు. వెంటనే బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని  డిమాండ్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)