Breaking News

క్రైమ్‌ నంబర్స్‌ 35

Published on Mon, 02/17/2025 - 07:44

సాక్షి, హైదరాబాద్‌: 2024 జనవరి 31న దోమలగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ వృద్ధురాలిని దారుణంగా చంపిన బిహారీ గ్యాంగ్‌ రూ.కోటి విలువైన సొత్తు, నగదు దోచుకుపోయింది. 2025 ఫిబ్రవరి 11 తెల్లవారుజామున నారాయణగూడ ఠాణా పరిధిలో కేడియా ఆయిల్స్‌ అధినేత ఇంటిని కొల్లగొట్టిన బిహారీ ముఠా రూ.40 కోట్ల సొత్తు, నగదు ఎత్తుకుపోయింది. 

నగర కమిషనరేట్‌లోనే ఉన్న మధ్య, తూర్పు మండలాల్లోని వేర్వేరు ఠాణాల్లో, వేర్వేరు సమయాల్లో నమోదైన ఈ రెండు కేసుల్లో బిహారీలే నిందితులు.. ఓ కీలక నిందితుడు రెండింటిలోనూ ఉన్నాడు.. అంతే కాదు వీటి క్రైం నంబర్లు 35 కావడం యాదృచ్చికం. మొదటి కేసు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని (ఐపీసీ) 302, 394 సెక్షన్ల కింద నమోదు కాగా... రెండోది జరిగే నాటికి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) అమలులోకి రావడంతో అందులోని 331 (2), 331 (4), 305 సెక్షన్ల కింద రిజిస్టర్‌ అయింది.  

బిహార్‌లో మధుబని జిల్లా బిరోల్‌కు చెందిన మహేష్‌ కుమార్‌ ముఖియా, మోల్హు ముఖియాలు 2024 జనవరి 31న దోమలగూడలో పంజా విసిరారు. వృద్ధురాలు స్నేహలత దేవికి ఉరి బిగించి చంపిన ఈ ఇద్దరు.. ఇంట్లో ఉన్న రూ.కోటి విలువైన నగలు, నగదు తీసుకుని ఉడాయించారు. దీనిపై అదే రోజు దోమలగూడ పోలీసుస్టేషన్‌లో 35/2024 నంబర్‌తో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదైంది. పోలీసు పరిభాషలో దీన్ని క్రైం నంబర్‌గానూ పరిగణిస్తారు. ఈ ఉదంతం జరిగిన ఎనిమిది నెలలకు మహేష్‌ చిక్కినా.. మోల్హు పరారీలోనే ఉన్నాడు. ఆపై ఈ నెల 11 తెల్లవారుజామున సుశీల్‌ ముఖియా, బసంతిలతో కలిసి హిమాయత్‌నగర్‌లోని కేడియా ఇంటిని కొల్లగొట్టాడు. దీనిపై అదే రోజు నారాయణగూడ ఠాణాలో 35/2025 నంబర్‌తో కేసు నమోదైంది.  

అప్పుడు చేసి ఇప్పుడు చిక్కాడు.. 
దోమలగూడ కేసులో వాంటెడ్‌గా ఉన్న మోల్హు నారాయణగూడ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసు దర్యాప్తు నేపథ్యంలో ఆ కేసు వివరాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా నమోదైన కేసు నారాయణగూడది కావడంతో పోలీసులు మోల్హును ఇందులోనే అరెస్టు చూపారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి మిగిలిన ఇద్దరితో కలిపి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా తొలుత నారాయణగూడ కేసులోనే న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఆపై ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్‌ ద్వారా దోమలగూడ కేసులో అరెస్టు, కోర్టు అనుమతితో కస్టడీ వంటి చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే నారాయణగూడ కేసులో పది రోజుల పోలీసు కస్టడీకి అనుమతించాలని కోరుతూ న్యాయస్థానంలో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.  

ప్రధాన సూత్రధారి రాహుల్‌.. 
బిరోల్‌కు చెందిన ముఖియాలతో కూడిన అనేక ముఠాలు దేశ వ్యాప్తంగా ఇలాంటి నేరాలు చేస్తున్నాయని పోలీసులు గుర్తించారు. అయితే వీరంతా పాత్రధారులే అని, ప్రధాన సూత్రధారి మాత్రం అదే ప్రాంతానికి చెందిన రాహుల్‌ అని పేర్కొంటున్నారు. ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ఈ నేరాలు చేసే వారికి అంత ఖరీదైన సొత్తు విక్రయించే సామర్థ్యం ఉందు. ఆ పరిచయాలన్నీ రాహుల్‌కే ఉంటాయి. వీరంతా సొత్తు తీసుకువెళ్లి అతడికి అప్పగించి వచ్చేస్తారు. దాన్ని విక్రయించి సొమ్ము చేసే అతగాడు ఎక్కువ వాటా తీసుకుని మిగిలింది నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారి కుటుంబీకులకు అందిస్తాడు. ప్రస్తుతం రాహుల్‌ నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్నట్లు తెలుస్తోంది’ అని పేర్కొన్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)