Breaking News

వచ్చేస్తోంది.. పేద్ద డ్రోన్‌

Published on Fri, 09/20/2024 - 04:20

శంషాబాద్‌: అత్యవసరాల్లో ట్రాఫిక్‌ కష్టాలుండవు.. అనుకున్న సమయానికి మీ కార్గో చేరిపోతుంది. ఎమర్జెన్సీలో తీసుకెళ్లాల్సిన వైద్య సంబంధిత వస్తు వులు, ఆర్గాన్స్‌ కూడా గ్రీన్‌ చానల్‌ ఏర్పాట్లు లేకుండా గమ్యానికి చేరిపోతాయి. దీనికి మరెంతో దూ రం లేదు. 2026లో మార్కెట్‌లోకి రాబోతున్న అతి పేద్ద డ్రోన్‌తో ఇవన్నీ సాకారమవుతాయి. హైదరాబాద్‌ యువ ఇంజనీర్లు దీన్ని సిద్ధం చేశారు. 

ఇప్పటికే ట్రయల్‌రన్‌లో సక్సెస్‌ కావడంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతులతో త్వరలో నే అందుబాటులోకి రానుంది. దీనిని ఆదిభట్లలోని బ్లూజే ఏరోస్పేస్‌ వ్యవస్థాపకులు ఉత్తమ్‌కుమార్, అమర్‌దీప్‌ నేతృత్వంలోని ఏరోనాటికల్‌ ఇంజనీర్ల బృందం తయారు చేసింది. నోవాటెల్‌ హోటల్‌లో ‘కోల్డ్‌చైన్‌ అన్‌బ్రోకెన్‌–2024’సదస్సులో దీనిని ఏర్పాటు చేశారు. 

‘పర్యావరణహితంగా తయారు చేసిన ఈ పైలట్‌రహిత డ్రోన్‌ 100 కిలోల కార్గోను 300 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానానికి  గంటన్నర సమయంలో తీసుకెళ్తుంది. ఇంత సామర్థ్య మున్న డ్రోన్‌ తయారీ దేశంలో ఇదే మొదటిది. 2029 నాటికి పదిమంది ప్రయాణికులతోపాటు వేయి కేజీల బరువు, వేయి కి.మీ. దూరం ప్రయాణించే డ్రోన్‌ను తయారుచేసేందుకు కృషిచేస్తున్నాం’అని ఉత్తమ్‌కుమార్‌ ‘సాక్షి’తో తెలిపారు.  

ప్రత్యేకతలు..
డ్రోన్‌ బరువు  400 కేజీలు 

మోసుకెళ్లే సామర్థ్యం 300 కి.మీ.

వేగం గంటకు 200 కి.మీ.

ప్రయాణించే ఎత్తు భూమికి 1000 అడుగుల ఎత్తులో

ఇంధనం  హైడ్రోజన్, విద్యుత్‌ (కాలుష్యరహితంగా)  

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)