Breaking News

కేటీఆర్‌కు బిగ్‌ షాక్‌.. వాట్‌ నెక్స్ట్‌?

Published on Tue, 01/07/2025 - 11:24

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఫార్ములా ఈ రేస్‌ కేసులో ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అరెస్ట్‌ నుంచి రక్షణ కోరగా.. ఆ విషయంలోనూ ఊరట ఇవ్వలేదు. దీంతో వాట్‌ నెక్స్ట్‌ అనే చర్చ తెరపైకి వచ్చింది.  

వాస్తవానికి క్వాష్‌ పిటిషన్‌ విచారణ సమయంలో హైకోర్టు కేటీఆర్‌(KTR)కు ఊరట ఇచ్చింది. తీర్పు ఇచ్చేంతవరకు ఆయన్ని అరెస్ట్‌ చేయొద్దని కోర్టు దర్యాప్తు సంస్థలకు సూచించింది. దీంతో ఇవాళ్టి వరకు ఎలాంటి చర్యలకు అవి ఉపక్రమించలేదు. మరోవైపు.. ఈ కారణం చూపిస్తూనే ఆయన దర్యాప్తు సంస్థల నుంచి విచారణ విషయంలో ఊరట కోరారు. 

అయితే తాజా తీర్పు నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్‌ కేసులో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ బీఆర్‌ఎస్‌(BRS Party) శ్రేణుల్లో నెలకొంది. మరోవైపు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేస్తారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.

కోర్టు తీర్పు అనంతరం బంజారాహిల్స్‌ నందినగర్‌(Nandi Nagar)లోని కేటీఆర్‌ నివాసం వద్ద భారీ బందోబస్తు కనిపిస్తోంది. తీర్పు వేళ ఆయన సోదరి కవితతో పాటు హరీష్‌రావు, మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు అక్కడికి చేరుకుని కేటీఆర్‌తో మంతనాలు జరుపుతున్నారు. అయితే.. ఈ తీర్పును సవాల్‌ చేసే యోచనలో బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీం ఉన్నట్లు సమాచారం. 

హైకోర్టు ఉత్తర్వుల కాపీ ఇంకా అందలేదు. సాయంత్రంలోపు అందే అవకాశం ఉంది. అవి అందాక తదుపరి చర్యలపై ఆలోచన చేస్తాం అని లీగల్‌ టీం ప్రకటించింది. మరోవైపు..

ఏసీబీ(ACB) ఇప్పటికే ఆయన్ని 9వ తేదీన విచారణకు రావాలంటూ రెండోసారి నోటీసులు పంపింది. తన వెంట లాయర్‌ను అనుమతించకపోవడంతో సోమవారం ఆయన విచారణకు హాజరుకాకుండానే ఏసీబీ ఆఫీస్‌ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. విచారణ టైంలోనే కేటీఆర్‌ను అదుపులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఆయన్ని ఈ కేసులో ఈడీ సైతం విచారణ  జరపాల్సి ఉంది. తాజాగా.. హైకోర్టు క్వాష్‌ కొట్టేయడంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చదవండి: కేటీఆర్‌ క్వాష్‌ కొట్టివేత, హైకోర్టు ఏం చెప్పిందంటే..

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు