Breaking News

రోడ్డుపై బాలింత.. మధ్యలోనే వదిలి వెళ్లిన 102 వాహనం

Published on Thu, 09/28/2023 - 10:34

బూర్గంపాడు (భద్రాద్రి కొత్తగూడెం): బురదమయంగా ఉన్న ఆ గ్రామ రహదారిపై వాహనం వెళ్లే పరిస్థితి లేక మూడు రోజుల బాలింతను రోడ్డుపైనే దింపి 102 వాహనం వెళ్లిపోయి న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. సారపాక సమీపంలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి చెందిన పార్వతి 3 రోజుల క్రితం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది.

బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసి అమ్మఒడి వాహనంలో ఇంటికి పంపించారు. అయితే ఆ వాహనం గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడంతో డ్రైవర్‌ శ్రీరాంపురం రహదారిపై దించేశాడు. దీంతో పార్వతి చంటిబిడ్డతో రెండు కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకుంది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పది రోజుల క్రితం ఇదే గ్రా మానికి చెందిన ఓ మహిళ పాముకాటుకు గురి కాగా, వాహన సౌకర్యం లేక మోసుకుంటూ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించింది. ఇప్పటికైనా ప్రభుత్వం  తమ గ్రామానికి రోడ్డు వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.
చదవండి: గణేష్‌ నిమజ్జనంలో అపశృతి.. డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో..

Videos

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)