Breaking News

రేషన్‌ షాపుల వద్ద జనం పోటెత్తారు!

Published on Tue, 08/04/2026 - 12:47

బంజారాహిల్స్‌: కేంద్ర ప్రభుత్వం పేద, బలహీన వర్గాలు ఇబ్బందులు పడకుండా గతంలో అత్యధిక వర్షాలు, తీవ్ర వేసవి పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేసింది. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ మాసాలకు సంబంధించి రేషన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది. వేసవి కాలంలో ఏప్రిల్, మే, జూన్‌ నెలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేశారు. జూలై 1 నుంచి నెల వారి రేషన్‌ పంపిణీ ప్రారంభించారు. కరువు పరిస్థితులు నెలకొన్న క్రమంలో మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు.  

22 రోజులు షాపులు ఓపెన్‌.. 
ఖైరతాబాద్‌ రేషనింగ్‌ సర్కిల్‌–7 పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సనత్‌నగర్‌ నియోజక వర్గాల పరిధిలో ఉన్న సోమాజిగూడ, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఫిలింనగర్, శ్రీనగర్‌ కాలనీ, కృష్ణానగర్, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, కారి్మకనగర్, వెంగల్‌రావునగర్, రాజీవ్‌నగర్, ఎర్రగడ్డ, బోరబండ, అమీర్‌పేట, సనత్‌నగర్, బల్కంపేట డివిజన్ల పరిధిలో ఉన్న 81 రేషన్‌ దుకాణాల పరిధిలో మూడు నెలల కోటా పంపిణీ చేస్తున్నారు.

 ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాలు తెరిచి ఉంచి బియ్యం పంపిణీ చేసేవారు. అయితే మూడు నెలల కోటా పంపిణీ సందర్భంగా ఆగస్టులో 22 రోజులు షాపులు తెరిచి ఉంచాలని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సరిపడా బియ్యాన్ని షాపుల్లో సిద్ధంగా ఉంచారు. రేషన్‌ బియ్యం పంపిణీ సక్రమంగా జరిగే విధంగా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజూ ఆయా రేషన్‌ షాపులను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)