Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులకు మరో ఎదురుదెబ్బ

Published on Fri, 07/12/2024 - 17:20

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్‌ కోసం చేసిన అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని,  ఇలాంటి సమయంలో బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు.. A3 తిరుపతన్న, A4 భుజంగరావు, A5 రాధాకిషన్ రావులు నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశారు. తమను అరెస్ట్‌ చేసి వంద రోజులు దాటిందని, పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేయకపోవడంతో మాండేటరీ బెయిల్‌ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. 

ఇదిలా ఉంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను నాలుగుసార్లు వెనక్కి పంపింది కోర్టు. దీంతో మూడున్నర నెలలు గడుస్తున్న పోలీసులు సక్రమంగా ఛార్జిషీటు వేయలేకపోయారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్‌ ఇస్తే దర్యాప్తు ప్రభావితం అవుతుందని పోలీసులు వాదించారు. దీంతో.. పోలీసు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టేసింది.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు