Breaking News

భుజంగరావు, రాధాకిషన్‌రావుకు బెయిల్‌

Published on Fri, 01/31/2025 - 01:27

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులు మాజీ అడిషనల్‌ ఎస్పీ నాయిని భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో తాజాగా సుప్రీంకోర్టు మరో నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ను, నిందితులు సుదీర్ఘ కాలం జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిస్తున్నట్లు పేర్కొంది. అయితే, కోర్టు నిందితులకు పలు షరతులు విధించింది. రూ.లక్ష చొప్పున సొంత పూచీకత్తు, 2 ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. 

8 వారాలపాటు ప్రతీ సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్‌హెచ్‌ఓ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా అవసరమై విచారణాధికారి కోరితే హాజరుకావాలని తెలిపింది. నిందితులు తమ పాస్‌పోర్టులను వెంటనే ట్రయల్‌కోర్టుకు సమర్పించాలని చెప్పింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, సాకు‡్ష్యలను బెదిరించడం, కలవడం, దర్యాప్తును ప్రభావితం చేయడం లాంటివి చేయవద్దని, మీడియాతో కేసు గురించి మాట్లాడవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. 

బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకునే స్వేచ్ఛను పోలీసులకు ఇచ్చింది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి 2024, మార్చిలో భుజంగరావు, రాధాకిషన్‌రావులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్తం భుజంగరావుకు నాంపల్లి కోర్టు గత ఆగస్టులో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అప్పటి నుంచి న్యాయస్థానాలు మధ్యంతర బెయిల్‌ పొడిగిస్తూ ఉండటంతో ఆయన బయటే ఉన్నారు.

ఈ నేపథ్యంలో రెగ్యులర్‌ బెయిల్‌ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు, చంచల్‌గూడ జైలులో ఉన్న రాధాకిషన్‌రావు కూడా బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇద్దరి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.సుజన గురువారం తీర్పు వెలువరించారు.  

సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిగణనలోకి.. 
ఇదే కేసులో మరో నిందితుడు తిరుపతన్నకు సుప్రీంకోర్టు తాజాగా బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల కాపీని పిటిషనర్ల న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. 

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను, నిందితులు సుదీర్ఘకాలం జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని షరతులతో బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.  మరో నిందితుడు ఎ.శ్రవణ్‌కుమార్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.   

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు