Breaking News

అజహర్‌ను వరించిన అదృష్టం

Published on Thu, 10/30/2025 - 07:22

సాక్షి, హైదరబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మెజారిటీగా ఉన్న మైనారిటీ ఓట్లను తన ఖాతాలో జమ చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపింది. సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ను కేబినెట్‌ బెర్త్‌లోకి తీసుకోవాలనే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తద్వారా ఉప ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి కెపె్టన్సీలోని మంత్రివర్గ టీంలో అజహరుద్దీన్‌ చేరనున్నారు. శుక్రవారం విస్తరించనున్న తెలంగాణ కేబినెట్‌లో అజారుద్దీన్‌ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. 

ఇప్పటికే ఏఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో  కేబినెట్‌ విస్తరణకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్‌ ఏర్పడినా.. ముస్లిం మైనారిటీని ఒక మంత్రి పదవి దక్కేది. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ముస్లిం మైనారిటీలు ఎన్నికల్లో గెలవకపోవడంతో ఆ వర్గానికి కేబినెట్‌లో అవకాశం లేకుండా పోయింది. అయితే.. ఏదో విధంగా మంత్రివర్గంలో ముస్లిం సామాజిక వర్గానికి కూడా స్థానం కలి్పంచాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచించింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో మైనారిటీ ఓట్ల కోసం పాచికగా అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.   

ఉప ఎన్నికల బరి నుంచి తప్పించి..  
గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అజహరుద్దీన్‌ ఓటమి పాలయ్యారు. అనంతరం.. బీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అకాల మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక్కడి నుంచే అజహర్‌ మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా కాంగ్రెస్‌ అధిష్టానం వ్యూహాత్మకంగా ఆయనను బరి నుంచి తప్పించింది. గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినప్పటికీ.. అది ఇంకా ఆమోదం పొందలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తి కాకపోయినప్పటికీ అజహరుద్దీన్‌ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. 

అన్ని విధాలా అనుకూలంగా మల్చుకునేందుకు.. 
అధికార కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల వార్‌లో అజహర్‌ను సూపర్‌ ఓవర్‌ కోసం రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇది రెండో ఉప ఎన్నిక కావడంతోపాటు జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఏకంగా నోటిఫికేషన్‌ కంటే రెండు నెలల  ముందు నుంచే ముగ్గురు రాష్ట్ర మంత్రులు, 18 మంది కార్పొరేషన్‌న్‌చైర్మన్లను రంగంలోకి దింపి అభివృద్ధి మంత్రం జపిస్తోంది. మరోవైపు సీనియర్లు పోటీ పడినప్పటికీ.. వారిని కాదని, యువనేత నవీన్‌ యాదవ్‌ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసి బీసీ కార్డు ప్రయోగిస్తోంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో సుమారు 24 శాతం మైనారిటీ ఓట్లు ఉండగా.. ఆ వర్గం ఓటు బ్యాంక్‌ను సైతం అనుకూలంగా మల్చుకునేందుకు అజహర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. అలాగే.. నగరం నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కలి్పంచినట్లు అవుతుందని 
కాంగ్రెస్‌ భావిస్తోంది.   

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ దక్కని పక్షంలో.. 
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో అజాహరుద్దీన్‌ ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మంత్రి వర్గంలో మరో ముగ్గురికి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఒక ముస్లిం మైనారిటీకి అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఒకవేళ గవర్నర్‌ కోటాలో అజహరుద్దీన్‌కు అవకాశం దక్కని పక్షంలో.. త్వరలో ఖాళీ కానున్న కొన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో  ఒక స్థానానికి ఆయనను ఎంపిక చేసే అవకాశమూ లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)