Breaking News

మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం నేడు

Published on Fri, 10/31/2025 - 05:54

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని శుక్రవారం విస్తరిస్తున్నారు. మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్‌ ఒక్కరినే కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఆయనతో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు గవర్నర్‌ కార్యదర్శి సీఎస్‌కు లేఖ రాశారు. 

ఈసీ ఉత్తర్వులనుబట్టే.. 
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకే అజహరుద్దీన్‌ను ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని అడ్డుకోవాలని.. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. 

గతంలో గోవాలో ఇలాగే ప్రమాణస్వీకార ఏర్పాట్లు జరుగుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లు పేర్కొంది. బీజేపీ నేతల ఫిర్యాదుపై సుదర్శన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. ఈసీ ఇచ్చే ఉత్తర్వులను అనుసరించి ఆయన కార్యాచరణ ఉండనుంది. 

ఏ శాఖ ఇస్తారో?
అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నాక ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయనకు కీలకమైన పదవిని అప్పగిస్తారా లేక మైనారిటీ సంక్షేమ శాఖతో సరిపుచ్చుతారా అనే చర్చ జరుగుతోంది. 

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ నుంచి మహమూద్‌ అలీకి రెండు దఫాల్లోనూ కీలకమైన హోం, రెవెన్యూ శాఖలను కేసీఆర్‌ అప్పగించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన దగ్గర ఉన్న శాఖలను ఇచ్చే పక్షంలో పెద్దగా మంత్రుల శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చని.. లేదంటే మంత్రుల శాఖలు స్వల్పంగా మారే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)