Breaking News

ఆ ఇద్దరికీ కీలక పదవులు.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్‌ క్లియర్‌

Published on Fri, 10/31/2025 - 14:02

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశించిన సీనియర్లకు అదిష్టానం బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పి. సుదర్శన్‌ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అలాగే.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావుకు సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ చైర్మన్‌ బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

సీనియర్‌ నేత, బోధన్‌ ఎమ్మెల్యే పి సుదర్శన్‌ రెడ్డి కేబినెట్‌ బెర్త్‌ ఆశించారు. అయితే బదులుగా ఆయనకు సలహాదారు పదవి కట్టబెడుతూ ఆరు గ్యారెంటీల అమలు బాధత్యను అప్పగించింది రేవంత్‌ ప్రభుత్వం. అలాగే.. ప్రేమ్‌సాగర్‌రావు కూడా కేబినెట్‌ అవకాశం కోసం ఆశలు పెట్టుకున్నారు. అయితే.. కేబినెట్ ర్యాంకు హోదాలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌ను కేటాయించింది. ఆశావహుల జాబితా నుంచి ఈ ఇద్దరూ అవుట్‌ కావడంతో మంత్రి వర్గ విస్తరణకు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది.  ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యం, సామాజిక వర్గాల ప్రాధాన్యతను కాంగ్రెస్‌ అధిష్టానం పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.  

రాజగోపాల్‌కు?
ఇదిలా ఉంటే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో బెర్త్‌ దక్కుతుందా? అనే ఆయన వర్గీయులు ఎదురు చూస్తున్నారు.

	New Cabinet Ministers: ఆ ఇద్దరికే కేబినెట్ హోదా!

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)