Breaking News

ఎయిర్‌పోర్టులలో గందరగోళం.. ప్రయాణికుల ఆగమాగం

Published on Fri, 12/05/2025 - 07:58

సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు.. ఇలా ప్రధాన నగరాల ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వకపోవడం.. వసతులు కల్పించడంలో విఫలం కావడంతో ఇండిగో తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

విమాన సర్వీసుల రద్దు విషయంలో ఇండిగో తన చెత్త రికార్డు తానే బద్ధలు కొట్టుకుంది. ఇవాళ ఒక్కరోజే 600కి పైగా విమానాలను రద్దు చేసింది. ఇందులో ఒక్క ఢిల్లీలోనే 220 విమానాలు ఉండడం గమనార్హం.  అలాగే ముంబైకి వెళ్లే 100 విమానాలను క్యాన్సిల్‌ చేసింది. ఇటు హైదరాబాద్‌లోనూ దాదాపు 80కిపైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. నేటి అర్ధరాత్రి దాకా ఈ రద్దు ఉంటుందని ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.

ప్రయాణికుల తీవ్ర అవస్థలు
సిబ్బంది కొరతే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.  ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలతో పైలెట్ల కొరత నెలకొంది. ఇండిగోతో పాటు ఇతర విమానయాన సంస్థలపైనా ఈ ప్రభావం పడింది. అయితే ఇండిగో దేశంలోనే అత్యధికంగా విమానాలు నడిపే సంస్థ కావడం, అప్పటికే అక్కడి సిబ్బంది కొరత ఉండడంతో ఎఫెక్ట్‌ ఈ స్థాయిలో కనిపిస్తోంది. 

 

 ఈ ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విమానాలు ఎప్పుడు ఎగరతాయో.. తమను ఎప్పుడు తీసుకెళ్తారో అని ఎదురు చూస్తున్నారు. ఎయిర్‌పోర్టులలో తమకు సరైన సదుపాయాలు అందించడం లేదని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటు.. వాళ్లకు సరైన సమాచారం అందించలేక ఇండిగో క్షమాపణలు చెబుతోంది. వెరసి.. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులలో గందరగోళం కొనసాగుతోంది.

ఇండిగో విమానాలు రద్దు కావడంతో.. అటు  మిగిలిన విమాన సంస్థలు దోపిడీకి దిగాయి. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి టికెట్‌ ధరలను పెంచేశాయి. ఏకంగా 40వేలు ఛార్జ్‌ చేస్తున్నాయి.

శంషాబాద్‌లో ఉద్రిక్తత 
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అ‍య్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటల పాటు ఆలస్యం కావడంతో స్వాములు నిరసనకు దిగారు.

షెడ్యూల్‌ ప్రకారం.. ఇండిగో విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు సాయంత్రమే శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, విమానం శుక్రవారం ఉదయానికి కూడా బయలుదేరాకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉన్నట్టు తెలిపారు. విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

మరోవైపు.. గురువారం ఉదయం కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కేరళకు వెళ్లే ఇండిగో విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా విమానం రద్దు చేస్తారు?” అంటూ భక్తులు విమానాశ్రయ అధికారులను ప్రశ్నించారు. విమాన రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని లేదా ప్రత్యేక విమానాన్ని నడపాలని భక్తులు డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ అసౌకర్యం పెరగడంతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)