Breaking News

200 ఎకరాలను పరిరక్షించాం!

Published on Sun, 12/29/2024 - 08:00

‘ఈ ఏడాది జూలై 19న హైడ్రా ఉద్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 ఎకరాలను పరిరక్షించాం. వీటిలో 12 చెరువులు, ఎనిమిది పార్కులతో పాటు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి’ అని హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు. బుద్ధభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల జోలికి వెళ్లమని, హైడ్రా ఏర్పడిన తర్వాత వెలిసిన అక్రమ నిర్మాణాల పైనే చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. 2025 సంవత్సరంలో హైడ్రా అనుసరించే విధానాలపై రూట్‌ మ్యాప్‌ తయారు చేస్తున్నారు.  

ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఆయా నిర్మాణాలకు నోటీసులు ఇచ్చే అధికారం కూడా హైడ్రాకు వచ్చింది. సంజాయిషీ నోటీసులతో పాటు అవసరాన్ని బట్టి ఖాళీ చేయమని, కూల్చేస్తామని సైతం నోటీసులు జారీ చేస్తుంది. గడిచిన 5 నెలల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 2025కు రూట్‌ మ్యాప్‌ తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు హైడ్రాకు 5800 ఫిర్యాదులు అందాయి. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి ఓఆర్‌ఆర్‌కు ఆనుకుంటూ అవతలి వైపునకూ విస్తరించి ఉన్న 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పునరు ద్ధరించిన 12 చెరువులకు 2025లో పునరుజ్జీవం కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హైడ్రా వాటి వివరాలను ప్రభుత్వానికి నివేదించనుంది.  

ఎవరి ప్రమేయం లేకుండా ఎఫ్‌టీఎల్‌... 
ప్రస్తుతం నగరం పరిధిలో ఉన్న 1095 చెరువుల్ని హైడ్రా గుర్తించింది. వీటి ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) నిర్ధారణ, పునర్‌ వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఏ దశలోనూ మానవ వనరుల ప్రమేయం లేకుండా పూర్తి సాంకేతికంగా దీన్ని తేల్చనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు, రికార్డులు, డేటా ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) డేటా, శాటిలైట్‌ ఇమేజ్‌తో పాటు అత్యంత రెజల్యూషన్‌ ఉన్న గూగుల్‌ డేటా తీసుకుంటున్నారు. 2006 నుంచి 2023 వరకు ఏరియల్, డ్రోన్స్‌ ఫొటోలతో పాటు రెవెన్యూ రికార్డులను అధ్యయనం చేస్తున్నారు. వీటి ద్వారా ఆయా చెరువుల ఎఫ్‌టీఎల్‌ మారడానికి కారణాలు స్పష్టంగా తెలుసుకోనున్నారు.  

పెద్ద నాలాల ఆక్రమణలపైనా నజర్‌... 
చెరువులతో పాటు నాలాల పైనా హైడ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీనికోసం కిర్లోస్కర్‌ కమిటీ, ఓమెంట్స్‌ నివేదికలను పరిశీలిస్తోంది. చిన్న చిన్న నాలాలు కాకుండా మూడు, నాలుగు ఆర్డర్స్‌లో ఉండే పెద్ద వాటిపైనే ప్రధానంగా దృష్టి పెడుతోంది. శాటిలైట్‌ ఇమేజ్‌ల ద్వారా నాలాలపై ఆక్రమణలను గుర్తిస్తున్నారు. చెరువులను మింగేస్తున్న వాటిలో భవన నిర్మాణ వ్యర్థాలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో 2025లో వీటి డంపింగ్‌ కోసం ప్రత్యేక స్థలాల గుర్తింపుతో పాటు జలవనరులకు జియో ఫెన్సింగ్‌ చేయనున్నారు. జనవరి నుంచి ప్రతి సోమవారం హైడ్రా గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించనున్నారు. ప్రజలు, కాలనీ అసోసియేషన్లు ఇచ్చే ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.  

యాప్, వెబ్‌సైట్‌ ద్వారా సమాచారం 
 హైడ్రా 2025లో తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్, ప్రభుత్వ స్థలాలు, పార్కులు తదితరాలకు సంబంధించిన సమస్త సమాచారం జీపీఎల్‌ ఆధారంగా నిక్షిప్తం చేయనున్నారు.  
ఓ వ్యక్తి ఎక్కడైనా నిల్చుని హైడ్రా యాప్‌ ఓపెన్‌ చేస్తే..అది వీటిలో ఏ ప్రాంతం పరిధిలోకి వస్తుందో తెలిసేలా అభివృద్ధి చేస్తున్నారు. హైడ్రా ఆవిర్భావం తర్వాత వీటిపై అవగాహన పెరిగిన ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  
 త్వరలో ఏర్పాటుకానున్న హైడ్రా పోలీసుస్టేషన్‌ ప్రభుత్వ, చెరువుల భూముల కబ్జా కేసులను దర్యాప్తు చేస్తుంది. ఈ దందాల వెనుక ఉన్న సూత్రధారులు, అధికారులను గుర్తిస్తుంది. 
 హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ డీ–మార్కేషన్‌ను 2025లో హైడ్రా పూర్తి చేయనుంది. మూసీలో ఉన్న ఆక్రమణల గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వర్షపు నీరు పరిరక్షణ పైనా హైడ్రా అధ్యయనం చేయనుంది.  

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు