Breaking News

‘కేబీఆర్‌’ వద్ద పార్కింగ్‌ కష్టాలకు ఉపశమనం

Published on Sat, 11/29/2025 - 19:11

సాక్షి, సిటీబ్యూరో: హైద‌రాబాద్‌ నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద పార్కింగ్‌ కష్టాలు తీరనున్నాయి. నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఆటోమేటెడ్‌ స్మార్ట్‌ రోటరీ పార్కింగ్‌ సదుపాయం శనివారం నుంచి అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. పీపీపీ మోడల్‌లో 404 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్కింగ్‌లో 72 కార్లను పార్కింగ్‌ చేయొచ్చు. మొత్తం పార్కింగ్‌ విస్తీర్ణంలో 20 శాతం ద్విచక్ర వాహనాల కోసం కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 5 నుంచి రాత్రి 11 గంటల పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది.

ముందస్తుగా పార్కింగ్‌ బుక్‌ చేసుకునేందుకు, నేవిగేషన్, ఇతర సర్వీసుల కోసం ఒక మొబైల్‌ యాప్‌ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. యంత్రాలు, స్మార్ట్‌ కార్డుల ద్వారా పార్కింగ్‌ టికెట్‌లు జారీ చేస్తారు. పార్కింగ్‌ సజావుగా సాగేందుకు డిజిటల్‌ సర్వీసుల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని జీహెచ్‌ఎంసీ (GHMC) పేర్కొంది. ఇది నగరంలో పబ్లిక్‌ ప్లేస్‌లో ఏర్పాటు చేసిన తొలి మల్టీలెవెల్‌ స్మార్ట్‌ కార్‌ పార్కింగ్‌ సిస్టమ్‌ (multi level smart car parking system).  

పార్కింగ్‌ ప్రత్యేకతలు: 
కాంపాక్ట్‌ డిజైన్‌: నిలువు రోటరీ సిస్టమ్‌ ద్వారా భూమి వినియోగం తగ్గింపు. 
స్మార్ట్‌ యాక్సెస్‌: ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత ఎంట్రీ, ఎగ్జిట్‌ 
ఈవీ చార్జింగ్‌:  గ్రీన్‌ మొబిలిటీకి తోడ్పాటు 
స్మార్ట్‌ భద్రత: సెన్సర్లు, లాకింగ్‌ వ్యవస్థలు, సీసీటీవీ పర్యవేక్షణ

చ‌ద‌వండి: కోకాపేట్‌లో ఎక‌రం రూ. 151.25 కోట్లు

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)