Breaking News

చైనా మాంజా.. ASI మెడకు తీవ్ర గాయం

Published on Tue, 01/13/2026 - 11:13

సాక్షి, ఉప్పల్‌: హైదరాబాద్‌ పోలీసులు హెచ్చరిస్తున్నా నిషేధిత చైనా మాంజా వాడకం మాత్రం తగ్గడం లేదు. సంక్రాంతి నేపథ్యంలో వరుస మాంజా ప్రమాదాలు.. వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉప్పల్‌లో మాంజా తగిలి.. ఏఎస్‌ఐ మెడకు తీవ్ర గాయమైంది. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై వివరాల మేరకు.. నగరంలోని నల్లకుంట పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు మాంజా కారణంగా గాయపడ్డారు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ పీఎస్‌ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్ద మాంజా ఆయన మెడకు చుట్టుకుని గొంతుకు తీవ్ర గాయామైంది. వెంటనే ఆయనను ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక, అంతకుముందు.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చైతన్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేతికి మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆయన చేయి తెగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మాదాపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, అవగాహన లోపంతో కొందరు వినియోగిస్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో మాంజా తెగి రోడ్లపై గాలిలో వేలాడుతూ వాహనదారులకు ముప్పుగా మారుతోంది. చైనా మాంజా కారణంగా గతంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)