Breaking News

డాక్టర్‌.. ఏఐ ఏం చెప్పిందంటే..

Published on Sun, 07/27/2025 - 04:51

సాక్షి, హైదరాబాద్‌: కృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికత అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. దీంతో చాలామంది తమ కు ఉన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కూడా ఏఐ ద్వారా తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. వైద్యు ల సలహా మేరకు చేయించుకునే మెడికల్‌ టెస్టులు, ల్యాబ్‌ రిపోర్టులను వైద్యులకు చూపించటానికి ముందే ఏఐ చాట్‌బాట్‌ల ద్వారా విశ్లేషించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు నిజ మైన వైద్యులకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.

ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇంటర్నెట్‌లో శోధించి చిట్కాలు తెలుసుకునే వారి ని ‘గూగుల్‌ డాక్టర్లు’గా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఏఐ చాట్‌బాట్‌లతో గతంకంటే ఎక్కువ విషయాలే తెలుస్తుండటంతో కొందరు తమకు అంతా తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ ఆన్‌లైన్‌ పరిజ్ఞానం బయట పెడుతూ నిజమైన వైద్యుల బుర్రలు తింటున్నారు. రోగుల మితిమీరిన సందేహాలతో వారిని సంతృప్తి పర్చలేక తమ తల ప్రాణం తోకకు వస్తోందని వైద్యులు వాపోతున్నారు. 

మంచీ.. చెడు రెండూ ఉన్నాయి.. 
జనరేటివ్‌ ఏఐ, చాట్‌ జీపీటీలో లభించే సమా చారంతో తమ రిపోర్టుల గురించి చర్చించే కొందరు రోగుల వాదనా పటిమ ఆశ్చర్యపరుస్తోందని ఢిల్లీలోని పీఎస్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్, ఎయిమ్స్‌ పల్మనాలజీ విభాగం మాజీ అధిపతి డా.జీసీ ఖిల్నానీ తెలిపారు. తమకు ఉన్న వైద్య సమస్యలపై డాక్టర్లను సంప్రదించడానికి ముందే కొందరు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న అనియంత్రిత సమాచారం ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

దీనివల్ల చాలామంది ఎంతో ఆందోళనతో తన వద్దకు వచ్చారని, వారికి అర్థమయ్యేలా వివరించేందుకు చాలా సమయం పట్టి ందని పేర్కొన్నారు.  ఊహించుకునే అవకాశాలు ఉన్నాయ ని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో డాక్టర్లు రోగులకు సరైన చికిత్స అందించేందుకు మొగ్గుచూపుతారని తెలిపా రు. ఏఐ చాట్‌బాట్‌లు ఆరోగ్య సంరక్షణపై ఆశాజనకమైన సమాచారం అందిస్తున్నా, ఆ సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి మానవ పర్యవేక్షణతోపాటు బాధ్యతాయుతమైన వ్యవస్థల ఆవశ్యకత ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)