Breaking News

సాయం పెంచండి.. ఖమ్మం ముంపు బాధితుల విజ్ఞప్తి

Published on Tue, 09/10/2024 - 05:32

సాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్నేరు ముంపు నష్టం లెక్క కట్టలేని స్థాయిలో ఉందని.. కానీ ప్రభుత్వం ఇస్తామంటున్న సాయం సరిపోయేలా లేదని వరద బాధితులు వాపోతున్నారు. నిత్యావసరాలు, దుస్తుల నుంచి ఎలక్ట్రానిక్‌ సామగ్రిదాకా ఏదీ మిగల్లేదని.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పనికి వెళ్తే తప్ప పూటగడవని పరిస్థితుల్లో ఉన్న తమ బతుకులు గాడిన పడాలంటే సర్కారు ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు. వరద ముంపునకు గురై ఎనిమిది రోజులు దాటినా ఇంకా ఎలాంటి సాయం అందలేదని వాపోతున్నారు.

సాయం కోసం ఎదురుచూస్తూనే..
మున్నేరు ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా కొలిక్కిరాలేదు. ఇళ్లను, మిగిలిన సామగ్రిని శుభ్రం చేసుకునేందుకే బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎవరైనా వచ్చి ఏదైనా సాయం అందిస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. మున్నేరు, ఆకేరు ఇతర వాగులకు వచ్చిన వరదతో ఖమ్మం జిల్లాలో 15,201 ఇళ్లు నీట మునగగా.. 70 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఎవరిని కదిలించినా.. సర్వం కోల్పోయి, మళ్లీ మొదటి నుంచి జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. 

ఇళ్లలోని ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్, టీవీ, మిక్సర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మంచాలు, టేబుల్స్, నిత్యావసరాలు అన్నీ పాడైపోయాయని అంటున్నారు. ఏళ్లకేళ్లుగా కూడబెట్టుకుని సమకూర్చుకున్న సామగ్రి అంతా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.16,500 సాయం అందిస్తే, తాత్కాలిక ఉపశమనమే ఉంటుందని.. ఇక తమ బతుకులు గాడినపడేది ఎలాగని వాపోతున్నారు.

పొలాల పరిహారమూ పెంచాలి..
వరదల వల్ల సాగుకోసం చేసిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోయామని.. ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు అవసరమని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్న పరిహారాన్ని పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా కొన్నిచోట్ల పొలాల్లో ఇసుక మేటలు, రాళ్లు చేరాయని.. వాటిని తొలగించాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని అంటున్నారు. అలాంటప్పుడు పరిహారం ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు.

పాలేరు వరదతో ఆరు ఎకరాల్లో వరి కొట్టుకుపోయింది. పొలం కోతకు గురై ఇసుక మేట వేసింది. కరెంటు మోటార్లు, స్తంభాలు కూడా కొట్టుకుపోయాయి. రూ.4 లక్షలకుపైనే నష్టం జరిగింది. ప్రభుత్వం ఇస్తామన్న పరిహారంతో ఇవన్నీ సరిచేసుకునేదెట్లాగో తెలియడం లేదు.
– బీరెల్లి సుధాకర్‌రెడ్డి, మల్లాయిగూడెం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా

ఈ సాయం సరిపోదు..
ఖమ్మం ధంసలాపురానికి చెందిన నిడిగుండ నరేశ్‌–ఈశ్వరమ్మలకు ఇద్దరు పిల్లలు. రోజూ పనికి వెళ్తేనే కుటుంబం గడిచేది. మున్నేరు వరదతో ఇంటి పునాది కోతకు గురై గోడలు పడిపోయాయి. ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్, కూలర్, గ్యాస్‌ సిలిండర్‌ అన్నీ కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఇస్తామంటున్న ఆర్థిక సాయంతో కోలుకునేది ఎలాగని నరేశ్‌ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం దయ చూపితేనే..
ఖమ్మం మోతీనగర్‌కు చెందిన కస్తూరి సంతోష–రమేశ్‌ కూలి పనులు వెళ్లి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంటి ప్రహరీ కూలిపోగా, తలుపులు ఊడిపోయి సామగ్రి కొట్టుకుపోయింది. ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని.. తమపై ప్రభుత్వం దయచూపితేనే కోలుకుంటామని వారు వాపోతున్నారు.

ఆదుకుంటేనే మనుగడ
ఖమ్మం వెంకటేశ్వర నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు తోపుడు బండిపై కూరగాయలు అమ్మడంతోపాటు చిన్న కిరాణాషాపు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. మున్నేటి వరదతో ఇంట్లో సామాన్లతోపాటు కిరాణా షాపులోని సామగ్రి అంతా కొట్టుకుపోయాయి. «అధికారులు వచ్చి పేర్లు రాసుకెళ్లినా ఇంకా ప్రభుత్వ సాయం అందలేదని.. సర్వం కోల్పోయిన తాము సాధారణ స్థితికి వచ్చేలా ప్రభుత్వమే ఆదుకోవాలని వెంకటేశ్వర్లు కోరుతున్నాడు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)