Breaking News

అప్పుల బాధతో స్టీల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య

Published on Sat, 09/19/2026 - 09:52

హైదరాబాద్‌: అప్పులు, ఆర్థికసమస్యల కారణంగా ఓ యువకుడు స్టీల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌  మధుబాబు తెలిపిన మేరకు.. పార్శిగుట్టకు చెందిన సోమరపు మనోజ్‌కుమార్‌ (29) ఇంటింటికీ తిరిగి రక్తపరీక్ష నమూనాలు సేకరిస్తూంటాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుల బాధ తాళలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం వీఎస్టీ స్టీల్‌ బ్రిడ్జి పైకి చేరుకుని తన ద్విచక్ర వాహనంపై మొబైల్‌ ఫోన్‌ ఉంచి బ్రిడ్జిపై నుంచి దూకాడు. తల, కాళ్లు చేతులకు తీవ్రగాయాలు కావడంతో తీవ్రరక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. 

పోలీసులు  మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మొబైల్‌లో మరణానికి గల కారణాలను టైప్‌ చేసి పెట్టాడు. తన కష్టకాలంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పులు ఇచ్చి ఆదుకున్న వారందరికీ ధన్యవాదాలు అని తెలుపుతూ తన ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒక్కడే ఉంటున్నాడు. ఈ సంఘటనతో స్టీల్‌ బ్రిడ్జిపై కాసేపు తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కాగా మృతదేహాన్ని అక్కకు అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు.  

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)