Breaking News

నాడు వైఎస్సార్, జగన్‌ నీళ్లు తీసుకెళ్తుంటే ఊడిగం చేశారు

Published on Sat, 02/22/2025 - 05:25

సాక్షి, నాగర్‌ కర్నూల్‌ / నారాయణపేట: ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క 4 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచితే ఆయనకు ఊడిగం చేసి.. చెప్పులు మోసి.. కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించిన సన్నాసి చంద్రశేఖరరావు అని తెలంగాణ   సీఎంరేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా.. ఆనాడు మంత్రి వర్గంలో నీ మంత్రులు లేరా.. హరీశ్‌ రావు ఆ మంత్రి వర్గంలో మంత్రి కాదా.. సమాధానం చెప్పాలని నిలదీశారు. 

ఆయన కుమారుడు జగన్‌­సీఎం అయ్యాక, ప్రజల స్వేదంతో నిర్మించిన ఇదే ప్రగతి భవన్‌ అధికారిక నివాసానికి పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి.. ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా.. ఇది ద్రోహం కాదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ తెచ్చు­కున్నామో.. ఏ నీళ్ల కోసం శ్రీకాంతచారి లాంటి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారో ఆ నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతుంటే ఏం చేశావని ప్రశ్నించారు. 

రంగారెడ్డి, మహబూ­బ్‌నగర్, నల్ల­గొం­డ జిల్లాలకు రావాల్సిన నీళ్లను తీసుకెళ్తుంటే ఒక్కరోజైనా నువ్వు అడ్డుకున్నావా అని ధ్వజ­మెత్తారు. ‘అవ్వాల నువ్వు చేసిన పాపం ఇయ్యాల మాకు శాపమైంది. ఇవాళ మాకు ఉరైంది. తొందర్లోనే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తయితే రోజుకు 10 టీఎంసీలు అంటే నెల రోజులు కళ్లు మూసుకుంటే 300 టీఎంసీల శ్రీశైలం నీళ్లు మొత్తం తరలించుకుపోతారు’ అని చెప్పారు. 

శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో మెడికల్‌ కళాశాల, నర్సింగ్, పారా మెడికల్‌ కళాశాలలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)