Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్‌

Published on Thu, 12/18/2025 - 22:23

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కొత్త సిట్‌ (Special Investigation Team) ఏర్పాటైంది. ఈ సిట్‌కు హైదరాబాద్ కొత్వాల్ (పోలీస్‌ కమిషనర్‌) సీపీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. 

కొత్త సిట్‌లో ఐదుగురు ఐపీఎస్‌లు సహా మొత్తం 9 మంది అధికారులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రేపు సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 

సజ్జన్నార్‌ నేతృత్వంలోని కొత్త సిట్‌ సభ్యులు..

రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

సిద్దిపేట సీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్

మాదాపూర్ డీసీపీ రితిరాజ్

మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి

గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం.రవీందర్ రెడ్డి

రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కె.ఎస్.రావు

జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి (దర్యాప్తు అధికారి)

టీజీనాబ్ డీఎస్పీ సీహెచ్‌.శ్రీధర్

హెచ్‌ఎంఆర్‌ఎల్ డీఎస్పీ నాగేందర్ రావు

కాగా, ఫోన్ ట్యాపింగ్‌పై ఐటీఏక్ట్, పీడీపీపీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద పంజాగుట్ట పీఎస్‌లో కేసు (క్రైం నంబర్ 243/2024) నమోదైంది. ఈ కేసుపై కొత్తగా ఏర్పాటైన సిట్‌ విచారణ చేయనుంది. ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అత్యున్నత వృత్తి నైపుణ్యాలతో విచారణ జరపాలని సూచించారు.


 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)