Breaking News

హెచ్‌సీఏలో మరో భారీ స్కాం

Published on Fri, 07/25/2025 - 19:12

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA)లో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. సమ్మర్ క్యాంప్‌ల పేరుతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌ రావు అండ్ కో.. రూ.4 కోట్ల రూపాయలు కాజేసినట్లు సీఐడీ గుర్తించింది. గతేడాది మే 20 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించిన హెచ్‌సీఏ.. ప్రతీ క్యాంప్‌లో 100 మందికి చొప్పున దాదాపు 2500 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చెప్పింది.

ఒక్కో క్యాంప్‌పై రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి.. రూ.4 కోట్ల రూపాయలు జగన్‌మోహన్‌రావు కాజేశారు. క్యాంప్‌కి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంప్‌లు నిర్వహించిన కేంద్రాల్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంప్‌లో లక్ష కూడా ఖర్చు చేయలేదని సీఐడీ ఆధారాలు సేకరించింది.

కాగా, హెచ్‌సీఏ కేసులో ముగ్గురికి బెయిల్‌ మంజూరైంది. హచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాస్‌రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. మరో వైపు జగన్‌మోహన్‌రావును కస్టడీ పొడిగించాలని సీఐడీ  వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. మల్కాజిగిరి కోర్టులో జగన్‌మోహన్‌రావుతో పాటు సీఈవో సునీల్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం బెయిల్ పిటిషన్‌లపై వాదనలు జరగనున్నాయి.

 

 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)