Breaking News

మరో మూడు నెలలు.. ఆఖరి అవకాశం

Published on Wed, 07/02/2025 - 03:27

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: స్మార్ట్‌ సిటీ మిషన్‌ (ఎస్‌సీఎం) నిధులుండీ.. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మూడు నెలల్లోగా ఆ పనులను పూర్తి చేయాల్సి ఉంటుందని, అయితే ఈ పథకం కొనసాగింపు, నిధుల కేటాయింపు ఉండదని సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు పురపాలక శాఖ స్మార్ట్‌ సిటీ మిషన్‌ ఇన్‌చార్జ్‌లకు సమాచారం అందించింది. గడువు పూర్తయినా అసంపూర్తి పనులున్న గ్రేటర్‌ వరంగల్, కరీంనగర్‌లతోపాటు స్మార్ట్‌సిటీల జాబితాలో ఉన్న 25 నగరాలకు ఈ అవకాశం ఉంది.  

మార్చి 31న ముగిసిన గడువు.. 
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 100 నగరాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. 2015, ఆగస్టు 27న ఈ పథకాన్ని ప్రారంభించింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం.. తద్వారా సుందర నగరాలుగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం. నిధుల వెసులుబాటు లేక ప్రాజెక్టులు పూర్తి కాకపో వడం వల్ల రెండుసార్లు గడువు పొడిగించిన ప్రభుత్వం.. ఈ ఏడాది మార్చి 31 వరకు మిషన్‌ పూర్తవుతుందని పేర్కొంది. 

అయినప్పటికీ 100 నగరాల్లో 25 మాత్రమే నూరు శాతం పూర్తి చేయగా, 50 నగరాల్లో 95 నుంచి 99 శాతంలో ఉన్నాయి. 25 నగరాల్లో ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉండగా, మరోసారి పొడిగిస్తారని భావించినా స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిధులుండీ అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వడంతో ‘మిషన్‌’నూరుశాతం లక్ష్యం నెరవేరనుంది.  

గ్రేటర్‌ వరంగల్‌లో పనుల పూర్తికి చాన్స్‌.. 
స్మార్ట్‌ సిటీ మిషన్‌ ముగింపు నాటికి తెలంగాణలో 87.2 శాతం పనులు పూర్తయ్యాయి. వరంగల్, కరీంనగర్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో ఎస్‌సీఎం కింద రూ.2,918 కోట్ల వ్యయం కాగల 169 ప్రాజెక్టులు 87.2 శాతమే పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇందులో వరంగల్‌ కార్పొరేషన్‌లో రూ.1,800 కోట్లతో చేపట్టిన 119 ప్రాజెక్టుల్లో 84.9 శాతం, కరీంనగర్‌లో రూ.1,117 కోట్లతో చేపట్టిన 50 ప్రాజెక్టులు 89 శాతం పూర్తయ్యాయి. 

మార్చి 31 తర్వాత నిధులుండీ.. పనులు అసంపూర్తిగా ఉండటంతో స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువు పెంచాలని తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శితో పాటు వెనుకబడిన ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు ఏప్రిల్‌ 11న కేంద్రానికి లేఖ రాశారు. ఆ రోజు నాటికి దేశంలోని నగరాల్లో నిధులు, పనుల వివరాలను కూడా నివేదించారు. 

ఈ నేపథ్యంలో నిధులుండీ, అసంపూర్తిగా పనులు పూర్తి చేసేందుకు అనుమతిచ్చిందని, పనులు కూడా సాగుతున్నాయని ఎస్‌సీఎంకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణలో వరంగల్, కరీంనగర్‌లతో పాటు దేశంలోని మరో 25 నగరాలకు ఈ అవకాశం కలిగిందని చెప్పారు. 

రూ. కోట్లలో
100 స్మార్ట్‌సిటీ మిషన్‌ నగరాలు

8,067 చేపట్టిన మొత్తం ప్రాజెక్టులు

1,64,400 ప్రాజెక్టుల ఖర్చు అంచనా

7,549 2025, మార్చి 31 వరకు పూర్తయిన ప్రాజెక్టులు

1,51,258 పూర్తయిన ప్రాజెక్టుల ఖర్చు

518 అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు

13,142 అసంపూర్తి ప్రాజెక్టుల అంచనా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)