Breaking News

2020: హైదరాబాద్‌లోనే మారుతిరావు ఆత్మహత్య

Published on Tue, 03/11/2025 - 07:42

సాక్షి,  హైదరాబాద్‌ : ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతిరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. 2020 మార్చి 7న ఖైరతాబాద్‌లో ఉన్న వైశ్య భవన్‌లో బస చేసిన ఆయన మరుసటి రోజు విగతజీవిగా కనిపించారు. న్యాయవాదిని కలవడానికి వచ్చి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అప్పట్లో మారుతిరావు బస చేసిన గది నుంచి పోలీసులు సూసైడ్‌ నోట్‌ సైతం స్వా«దీనం చేసుకున్నారు. మారుతిరావు తన వాహనంలో డ్రైవర్‌ బెల్లంకొండ రాజేష్‌ తో కలిసి నగరానికి వచ్చారు. 2020 మార్చి 7 సాయంత్రం 6:40 గంటలకు ఖైరతాబాద్‌ చింతల్‌బస్తీలో ఉన్న ఆర్య వైశ్య భవన్‌ రూమ్‌ నెం.306లో బస చేశారు. న్యాయవాది వస్తారంటూ డ్రైవర్‌తో చెప్పిన మారుతిరావు అతడిని కారులోనే ఉండమన్నారు.

 ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో బయటకు వచ్చిన మారుతిరావు డ్రైవర్‌ను పిలిచి ఎదురుగా ఉన్న మిర్చీ బండీ నుంచి గారెలు, కారులో కొన్ని కాగితాలు  తెప్పించుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తన గదిలో ఏసీని బాగు చేయించుకున్న మారుతిరావు.. లోపల నుంచి తలుపులు వేసుకుని పడుకున్నారు. మరుసటి రోజు (2020 మార్చి 8) ఉదయం మిర్యాలగూడలో ఉన్న ఆయన భార్య గిరిజ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో డ్రైవర్‌ రాజేష్‌కు ఫోన్‌ చేయగా..అతడు పైకి వెళ్లి ప్రయత్నించిన అతడు చివరకు వైశ్య భవన్‌ నిర్వాహకుల ద్వారా సైఫాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు గదిలోకి ప్రవేశించగా...మంచంపై విగతజీవిగా పడి ఉన్న మారుతిరావు కనిపించారు. ఆ గదిలో ఓ సూసైడ్‌నోట్‌ పోలీసులకు లభించింది. అందులో ‘గిరిజా క్షమించు...అమ్మా అమృత అమ్మ దగ్గరకు రా అమ్మా’ అని మాత్రమే ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అప్ప ట్లో వైశ్య భవన్‌ వద్దకు వచ్చిన మారుతిరావు సోదరుడు శ్రవణ్‌ మీడియాతో మాట్లాడుతూ... వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయా లని, ఊహా కల్పనతో వార్తలు రాయవద్దని దురుసుగా మాట్లాడారు. తాజాగా ప్రణయ్‌ కేసులో శ్రవణ్‌కు జీవితఖైదు పడటం గమనార్హం.  


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)