చర్చనీయాంశమైన అమీర్‌పేట అగ్ని ప్రమాద ఉదంతం

Published on Sat, 02/21/2026 - 07:32

హైదరాబాద్ : అమీర్‌పేట.. వ్యాపార, వాణిజ్య, సాఫ్ట్‌వేర్‌ శిక్షణ కేంద్రాలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. ఇక్కడి మైత్రీవనంతో పాటు సత్యం టాకీస్‌ రోడ్డును గమనిస్తే అన్ని సాఫ్ట్‌వేర్‌ శిక్షణ కేంద్రాలతో పాటు కంప్యూటర్‌ సంబంధిత ఉత్పత్తుల విక్రయ, సరీ్వసింగ్‌ సెంటర్లే కొలువుదీరాయి. ప్రచారంలో ముందుండాలనే ఉద్దేశంతో ఎవరికి వారు భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అయితే.. అటు భవనాల మెయింటెన్స్‌ నిర్వాహకులు, ఇటు సాఫ్ట్‌వేర్‌ శిక్షణ కేంద్రాల నిర్వాహకులు ప్రచార హోర్డింగ్‌లకు ఇచ్చే ప్రాధాన్యం రక్షణకు ఇవ్వడం లేదు. ఇందుకు శుక్రవారం అమీర్‌పేట ఆదిత్య ట్రేడ్‌ సెంటర్‌లోని నీలగిరి బ్లాక్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదమే ఉదాహరణ. ఫైర్‌ సేప్టీ విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపించింది.  

బయటపడే మార్గమేదీ?  
భవనాల మెట్లు ఎటువైపు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. ఎక్కడికక్కడ వ్యాపార కార్యకలాపాలు, శిక్షణ కేంద్రాలకు వచ్చే విద్యార్థులతో నిత్యం రద్దీగా ఉండే ఈ భవనాలు మొత్తం ప్రచార హోర్డింగ్‌లతో నిండిపోయాయి. ఇంచు గ్యాప్‌ లేకుండా ఏర్పాటుచేసిన హోర్డింగ్‌లే శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాద బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు అడుగడుగునా అడ్డు తగిలాయి. కనీసం నిచ్చెన వేయడానికి కూడా వీలులేకుండా ఇక్కడ హోర్డింగ్‌లు ఉండడంతో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలే వేసవికాలం కావడంతో కేబుళ్లపై పవర్‌ లోడ్‌ ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇక్కడి కేబుళ్ల నిర్వహణపై పూర్తిస్థాయి దృష్టిసారించాల్సి ఉంది.

ప్రమాదాలు సంభవించినప్పుడే హడావుడి.. 
గుల్జార్‌హౌస్‌ ఘటన, నారాయణగూడ కేబుల్‌ ప్రమాద ఘటనతో హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత మిన్నకుండిపోయారు. పూర్తిస్థాయిలో స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టి తదనుగుణంగా చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఫైర్‌సేప్టీ పరికరాలు కేవలం అలంకార ప్రాయంగానే ఉంటున్నాయి. ఇటీవల అగి్నమాపక సిబ్బంది, హైడ్రా సంయుక్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టి పలు సంస్థలకు చెందిన భవనాలను సీజ్‌ చేసిన విషయం విదితమే. ఫైర్‌సేప్టీ  నిబంధనలను కఠినతరం చేస్తేనే అగ్ని ప్రమాదాలను నివారించే అవకాశముంది.  

సెల్లార్లలోనే వైద్యం 
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పలు ఆస్పత్రులు సెల్లార్లలోనే వైద్య సేవలు అందిస్తున్నాయి. ఎమర్జెన్సీ సేవలు, ఎమ్మారై, సీటీ స్కాన్,  ఓపీ, రేడియేషన్‌ అధికంగా ఉండే కొన్ని పరికరాలను గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి కింద ఉన్న సెల్లార్, బీ–2 ఫ్లోర్లలో నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆక్సిజన్, ఇతర సిలిండర్లను నిల్వ చేస్తున్నారు. ఫైర్‌ సేఫ్టీ పద్ధతులు అంతగానే ఉంటున్నాయి. చిన్న ప్రైవేటు దవాఖానాల నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రుల వరకు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)