అనుమానంతో భార్యను బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త

Published on Mon, 11/10/2025 - 07:24

హైదరాబాద్‌: భార్యపై అనుమానంతో భర్త ఆమెను బ్యాట్‌తో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేశ్‌ కథనం ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా బీతపూడికి చెందిన వెంకట బ్రహ్మయ్య, కృష్ణవేణి భార్యాభర్తలు. మూడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చి అమీన్‌పూర్‌ కేఎస్‌ఆర్‌నగర్‌ కాలనీలోని విష్ణుప్రియ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. గుంటూరు నుంచి వచ్చాక తొలుత వీరు హైదరాబాద్‌లో నివాసం ఉండగా గత మూడు సంవత్సరాల నుంచి సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు.

కృష్ణవేణి డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా కోహిర్‌ బ్రాంచ్‌లో పని చేస్తోంది. వెంకట బ్రహ్మయ్య రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. కాగా, భార్యపై బ్రహ్మయ్య కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వెంకట బ్రహ్మయ్య బ్యాట్‌తో భార్యను కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కృష్ణవేణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

∙    
∙    సంగారెడ్డి జిల్లాలో ఘటన
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)