Breaking News

కుమారుడి ‘జ్ఞాపకం’ కోసం ఓ తండ్రి ఆవేదన

Published on Mon, 07/06/2026 - 07:17

హైదరాబాద్‌, అంబర్‌పేట: రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుడికి సమాధి కట్టించాలనుకుంటున్న ఓ తండ్రి చేస్తున్న ప్రయత్నాన్ని ఓ వ్యక్తి ముందుకు కదలనివ్వడం లేదు. సమాధి నిర్మిస్తా అంటూ డబ్బుతీసుకుని నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన ఆదివారం అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం... డీడీ కాలనీకి చెందిన సూర్యనారాయణ మూర్తి కుమారుడు సురేష్‌(34) 2022లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో భువనగిరి జిల్లా సీమలకొండూరులోని సొంతపొలంలో  దహనసంస్కారాలు చేసి అక్కడ భారీ ఖర్చుతో సమాధి కట్టించాడు. అక్కడ కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం సమాధి అడ్డు వస్తుందని, ఇక్కడి నుంచి తరలించాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అతను కుమారుడి అస్థికలను తీసుకుని ఘట్‌కేసర్‌లోని స్మృతివనంలో నిర్వాహకులతో సంప్రదించి అస్థికలను పూడ్చిపెట్టాడు.

పూడ్చిపెట్టిన ప్రాంతంలో సమాధి కట్టించడానికి రామ్‌చందర్‌ అనే వ్యక్తిని సంప్రదించడంతో రూ.  లక్ష ఖర్చవుతుందని అందుకు అడ్వాన్స్‌ ఇవ్వాలని ప్రతిపాదించాడు. దీంతో సూర్యనారాయణ మూర్తి రూ. 50 వేలు అడ్వాన్స్‌ను ఈ ఏడాది మార్చి 25న ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అడ్వాన్స్‌ తీసుకున్న రామ్‌చందర్‌ ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. దీంతో అతను గత నెల అంబర్‌పేట పోలీసులను ఆశ్రయించగా  నెల రోజుల్లో పూర్తి అయ్యేలా హామీ ఇప్పించారు. అయినా అతని తీరులో మార్పు రాకపోవడంతో  ఆదివారం తిరిగి పోలీసు స్టేషన్‌కు వచ్చి న్యాయం చేయాలని కోరాడు. అవసరమైతే కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చి పంపించారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)