Breaking News

ఢిల్లీ దిశగా హైదరాబాద్‌.. స్వచ్చమైన గాలి కష్టమే!

Published on Fri, 12/05/2025 - 07:18

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టంగానే మారుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు హైదరాబాద్‌ సరాసరి ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) ఒక్క రోజు కూడా నాణ్యమైన గాలి (గుడ్‌ ఎయిర్‌) లేదని నివేదికలు చెబుతున్నాయి. గడచిన నాలుగేళ్లలో డిసెంబరు నెల వాయు కాలుష్యం (ఏక్యూఐ) పరిశీలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఏక్యూఐ 50 లోపు ఉంటే స్వచ్ఛమైన గాలిగా పేర్కొంటారు. ఈ ఏడాది జనవరి నుంచి గడచిన 337 రోజుల్లో 203 రోజులు సాధారణ స్థాయిలో ఉండగా, 110 రోజులు పూర్‌ ఏక్యూఐ నమోదు కాగా..  23 రోజులు అన్‌హెల్దీగా పేర్కొంటున్నారు. 2022 నుంచి డిసెంబరు నెల వాయు నాణ్యత సూచీ పరిశీలిస్తే ఈ ఏడాది 185గా ఉంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వాయు కాలుష్యం నమోదు కాలేదు. 

నగరంలోని ఫైనాన్సియల్‌ జిల్లాలో బుధవారం వాయు నాణ్య సూచీ 253గా నమోదు కావడం విశేషం. అదే సమయంలో అమీన్‌పూర్‌లో 201గా ఉంది. హైదరాబాద్‌ సైతం వాయు కాలుష్యంలో ఢిల్లీ వైపు అడుగులు వేస్తోందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమాజిగూడ, బొల్లారం, పాశమైలారం, బంజారాహిల్స్, సనత్‌నగర్, బొల్లారం, రామచంద్రాపురం ఇతర ప్రాంతాల్లోనూ 170 నుంచి 189 మధ్య నమోదైంది.

ఇది కూడా చదవండి: వ్యవసాయం అంటే పంటలే కాదు.. వ్యాపారం కూడా..


 

 

 


 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)