Breaking News

అందరూ కొత్త వారే..

Published on Wed, 10/15/2025 - 05:04

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా రెండోసారి డీసీసీ అధ్యక్షుడు కావాలనుకుంటున్న నేతల ఆశలపై ఏఐసీసీ నీళ్లు చల్లింది. పార్టీలో సీనియార్టీ, ప్రస్తుతం అనుభవిస్తున్న పదవులు, సామాజిక వర్గాలు, బంధుత్వాలు, ఇతర అంశాలతో పని లేకుండా ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా ఉన్న వారెవరినీ మళ్లీ అదే పదవిలో నియమించబోమని స్పష్టం చేసింది. అంటే అందరూ కొత్తవారే ఉంటారు. దీంతో చాలామంది ఆశావహుల్లో నైరాశ్యం నెలకొంది. 

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష నియామకాల ప్రక్రియ జోరందుకున్న వేళ మంగళవారం జూమ్‌ మీటింగ్‌ వేదికగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇప్పుడు డీసీసీ అధ్యక్షులుగా ఉన్న వారెవరూ రెండోసారి నియమితులు కాబోరని, వారు దరఖాస్తు చేసుకోవద్దని సూచించారు. దీంతోపాటు డీసీసీ అధ్యక్ష నియామకాల కోసం ఏఐసీసీ అనేక ని‘బంధనాలు’పెట్టింది. మీనాక్షి, మహేశ్‌గౌడ్‌ డీసీసీ అధ్యక్షులతో వెల్లడించిన వివరాలు ఇలా... 

–డీసీసీ అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం ఐదేళ్లపాటు నిరంతరాయంగా పార్టీలో పనిచేయాలి. అదేవిధంగా క్రమశిక్షణతో పనిచేసి ఉండాలి. ఎలాంటి క్రమశిక్షణా చర్యలు వారిపై సిఫారసు చేసి ఉండకూడదు. ఒకవేళ అలాంటి నేతలు దరఖాస్తు చేసుకుంటే ఏఐసీసీ పరిశీలకులే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు.  
–ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారి దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా ఈసారి అవకాశాల్లేవు.  

–ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా నేతలకు ప్రాధాన్యత ఉంటుంది.  
–ఏఐసీసీ పరిశీలకులుగా జిల్లాలకు వచ్చిన వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. ఏఐసీసీ పరిశీలకులతో వ్యక్తిగత సంభాషణలు చేయొద్దు. ప్రైవేటుగా సమావేశాలు పెట్టుకోవద్దు.  

–ఎట్టి పరిస్థితుల్లో డీసీసీ అధ్యక్ష పదవుల కోసం అభిప్రాయ సేకరణ సమావేశాలను నాయకుల ఇళ్లలో లేదా వారి సొంత కార్యాలయాల్లో నిర్వహించడానికి వీల్లేదు. పార్టీ కార్యాలయాల్లో గానీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే ఇతర ప్రాంతాల్లో గానీ నిర్వహించాలి.  

–ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇచ్చిన ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలి.  
–అదేవిధంగా ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓట్‌చోరీ క్యాంపెయిన్‌ను విస్తృతం చేయాలని, ప్రతి గ్రామంలో కనీసం 100 మంది చేత సంతకాలు చేయించి టీపీసీసీకి పంపాలని మీనాక్షి, మహేశ్‌గౌడ్‌ ఆదేశించారు.    

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)