Breaking News

నిజంగా ఇది హాస్ట‌లే.. న‌మ్మండి బాబూ!

Published on Sat, 07/12/2025 - 19:19

ఆదిలాబాద్‌  జిల్లా మావల మండల కేంద్రంలోని ఈ భవనంలో జైనథ్‌ మండలానికి చెందిన మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారు. పదేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. భవనం శిథిలమై అసౌకర్యంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

భవనానికి కిటికీలు సైతం లేకపోవడంతో.. ఇటీవలి వర్షాలకు నీరు లోపలకు రాకుండా గోనె సంచులు, చద్దర్లు, అట్టముక్కలు కడుతున్నారు. వర్షాకాలం కావడంతో పురుగు, పుట్రతో భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.      
– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌

మక్క బుట్టలకు మస్తు గిరాకీ 
నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామం పచ్చి మక్క బుట్టలకు చిరునామాగా నిలిచింది. చేతికి వచ్చిన బుట్టలను డజన్‌ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఆటో ట్రాలీ మక్క బుట్టల ధర రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు పలుకుతోంది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్, కరీంనగర్, మంచిర్యాల్, మహారాష్ట్ర, చుట్టు పక్కల ప్రాంతాల వ్యాపారులు మక్కబుట్టలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. 

అంకాపూర్‌ మార్కెట్‌ శుక్రవారం పచ్చి మక్క బుట్ట విక్రయాలతో సందడిగా మారింది. సీజన్‌లో ఉదయం 5 గంటల నుంచి.. ఉదయం 9 గంటల వరకు హోల్‌సేల్‌ వ్యాపారం సాగుతోంది.  
– సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌

చ‌ద‌వండి: మేక‌ల క‌ల్యాణి.. నీకు హ్యాట్సాఫ్‌  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)