Breaking News

ఆదిలాబాద్‌: ఊట్నూర్‌లో పదో తరగతి ఆన్సర్‌షీట్లు మిస్సింగ్‌

Published on Tue, 04/04/2023 - 08:32

సాక్షి, ఆదిలాబాద్‌: ఉట్నూరు ootnur మండల కేంద్రంలో పదవ తరగతి ఆన్సర్‌షీట్‌ల కట్ట మిస్‌ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. 

దాదాపు ఇరవై మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. పోస్టల్‌ అధికారి ఫిర్యాదు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా? లేదంటే ఎవరైనా కావాలని మాయం చేశారా? అనే తేల్చే పనిలో ఉన్నారు ఎస్సై భరత్. మరోవైపు అవి ఏ సెంటర్‌ పేపర్లు అనేది స్పష్టత లేకపోవడంతో.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

ఈ వ్యవహారంపై విద్యాశాఖ స్పందించింది. సాక్షితో డీఈఓ ప్రణీత మాట్లాడుతూ..  ‘‘ఉట్నూరు పదవ తరగతి జవాబు పత్రాలు మాయం అయ్యాయి.  పదిహేను మంది  విద్యార్థుల తెలుగు జవాబు పత్రాలు మాయం అయినట్లు గుర్తించాం. పోస్టాఫీస్‌ నుంచి బస్టాండ్‌కు తరలిస్తుండగానే అవి పోయాయి. కాబట్టి, పోస్టల్‌ అధికారులదే బాధ్యత. వాళ్లకు ఆన్సర్‌షీట్లు అప్పగించినట్లు మా దగ్గర రిసిప్ట్‌ కూడా ఉంది. ఇది కేవలం వాళ్ల నిర్లక్ష్యమే. ఇందులో మా తప్పిదం ఏం లేదు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారామె. 
 

ఇదీ చదవండి: పరీక్ష ప్రారంభమైన కాసేపటికే.. టెన్త్‌ పేపర్‌ అవుట్‌!

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)