Breaking News

ఏసీబీ వలలో మేడ్చల్‌ ఏఎస్‌ఐ 

Published on Tue, 10/08/2024 - 08:19

మేడ్చల్‌రూరల్‌: స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ. 2 లక్షలు డిమాండ్‌ చేసిన ఏఎస్‌ఐని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్‌ చేశారు.   ఏసీబీ డీఏస్పీ శ్రీధర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన శర్మ మేడ్చల్‌ మండలం, గౌడవెళ్లి గ్రామ పరిధిలోని సాకేత్‌ ప్రణమ్‌లో విల్లా కొనుగోలు చేశాడు. అందులో ఇంటీరియర్‌ పనుల కోసం సరూర్‌నగర్‌కు చెందిన విశ్వనాథ్‌తో రూ.8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.  అడ్వాన్స్‌గా రూ.4 లక్షలు చెల్లించాడు. సగం పనులు పూర్తి చేసిన విశ్వనాథ్‌  మిగిలిన  డబ్బులు ఇవ్వాలని కోరగా, అందుకు శర్మ నిరాకరించడంతో   విశ్వనాథ్‌ పనులు నిలిపివేశాడు.

 ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  దీంతో శర్మ రెండు నెలల క్రితం మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో విశ్వనాథ్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టిన పోలీసులు నార్సింగిలో అతడిని అదుపులోకి తీసుకుని మేడ్చల్‌ పీఎస్‌కు తీసుకువచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్న  ఏఎస్‌ఐ మధుసూదన్‌ స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు,  ఇరువర్గాల మధ్య సయోద్య కుదిర్చేందుకు విశ్వనాథ్‌ను రూ.2 లక్షలు డిమాండ్‌ చేశాడు. అందులో  భాగంగా మొదట రూ.10 వేలు తీసుకున్నాడు. మిగతా మొత్తాన్ని విడతల వారీగా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 5న రూ.50 వేలు తీసుకురావాలని ఏఎస్‌ఐ  ఫోన్‌  చేయడంతో   విశ్వనాథ్‌    ఏసీబీ అధికారులను సంప్రదించాడు. 

వారి సూచన మేరకు సోమవారం స్టేషన్‌కు వచ్చి డబ్బులు ఇస్తానని ఏఎస్‌ఐకి చెప్పాడు. పథకం ప్రకారం మాటు వేసిన ఏసీబీ అధికారులు  సోమవారం విశ్వనాథ్‌ ఏఎస్‌ఐ మధుసూదన్‌రావుకు స్టేషన్‌ ఆవరణ వెనుక నగదు అందజేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన అధికారులు  ఏఎస్‌ఐని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ విషయంలో ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)