Breaking News

సెల్‌ఫోన్లు ఇవ్వండి.. కేటీఆర్‌కు ఏసీబీ ఆదేశం

Published on Tue, 06/17/2025 - 01:10

సాక్షి, హైదరాబాద్‌:  ఫార్ములా–ఈ కారు రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావును ఏసీబీ అధికారులు సోమవారం 8 గంటలకు పైగా విచారించారు. రేసు నిర్వాహకులతో కుదుర్చుకున్న ఒప్పందాలు మొదలు, నిధుల మళ్లింపు, నిబంధనల అతిక్రమణ, విదేశీ కంపెనీతో జరిపిన లావాదేవీలు..తదితర అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఫోన్‌ ఇవ్వమని కోరగా..తీసుకురాలేదని కేటీఆర్‌ సమాధానమిచ్చినట్టు తెలిసింది. దీంతో ఫార్ములా ఈ–కారు రేసు నిర్వహణకు సంబంధించి ఒప్పందాలు మొదలైన 2021 నుంచి 2024 మధ్య కాలంలో వినియోగించిన సెల్‌ఫోన్లు ఈ నెల 18 లోగా అప్పగించాలని కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఆదేశించారు.  

వరుస ప్రశ్నలు..మధ్యమధ్యలో బ్రేక్‌ 
ఏసీబీ అధికారుల నోటీసుల మేరకు కేటీఆర్‌ సోమవారం ఉదయం 10 గంటలకు తన న్యాయవాది రాంచందర్‌రావుతో కలిసి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కేవలం కేటీఆర్‌ వాహనాన్ని మాత్రమే పోలీసులు లోనికి అనుమతించారు. కాగా సాయంత్రం 6 గంటల వరకు అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు. 

ఏసీబీ డైరెక్టర్‌ తరుణ్‌జోష్‌, జాయింట్‌ డైరెక్టర్‌ రితిరాజ్, ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ (సీఐయూ) డీఎస్పీ మాజిద్‌ అలీ ఖాన్‌లతో కూడిన బృందం ప్రశ్నించినట్టు తెలిసింది. మధ్యలో టీ బ్రేక్‌లు ఇచ్చారని, మధ్యాహ్నం 45 నిమిషాలకు పైగా భోజన విరామం ఇచ్చినట్టు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జనవరి 9న కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా సోమవారం నాటి విచారణలో పలు కీలక అంశాలపై ప్రశ్నించారు.  

డాక్యుమెంట్లు ముందుంచి.. 
ఈ కేసులో ఏ–2 అయిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిఅర్వింద్‌కుమార్, ఏ–3 హెచ్‌ఎండీఏ బోర్డు మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డితో పాటు గ్రీన్‌కో ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ స్టేట్మెంట్లలో గుర్తించిన అంశాలు, ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ సంస్థ ప్రతినిధులను, సీఈవోను జూమ్‌ మీటింగ్‌ ద్వారా గతంలో వర్చువల్‌గా విచారించిన సమయంలో వారిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తయారు చేసుకున్న ప్రశ్నావళి ఆధారంగా కేటీఆర్‌ను అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. 

ఇప్పటికే సేకరించిన పలు డాక్యుమెంట్లను ముందుంచి ప్రశ్నించారు. వరుస ప్రశ్నలు వేస్తూ, డాక్యుమెంట్లను చూపుతూ వివరాలు రాబట్టారు. కేటీఆర్‌ చెప్పేదంతా వీడియో రికార్డింగ్‌ చేశారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉండగా ఏ హోదాలో ఆదేశాలు ఇచ్చారనే కోణంలో విచారణ సాగింది. మొదటి దఫా విచారణలో కేటీఆర్‌ ఇచ్చిన సమాచారం, కేసు దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ ఆధారంగా క్రాస్‌ క్వశ్చనింగ్‌ చేశారు. 

ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ సంస్థ ఖాతాలకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై, అనధికారింగా ఈ నగదు బదిలీ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయాలపై మరోసారి ప్రశ్నించినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎలక్టోరల్‌ బాండ్స్‌ గ్రీన్‌కో కంపెనీ కొనుగోలుపైనా ఆరా తీసినట్టు తెలిసింది. కాగా అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు సూచించినట్టు తెలిసింది.  

బీఆర్‌ఎస్‌ శ్రేణుల హడావుడి..ఉద్రిక్తత  
కేటీఆర్‌ విచారణకు బంజారాహిల్స్‌ వస్తుండడంతో పాటు అక్కడి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఏసీబీ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ భవన్‌ నుంచి కేటీఆర్‌ను అనుసరిస్తూ పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నాయకులు, పార్టీ శ్రేణులు ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే పోలీసులు వారిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు ముందే అడ్డుకున్నారు. 

కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు, శ్రేణులు పక్కనే ఉన్న నీలోఫర్‌ కేఫ్‌లోకి వెళ్లడంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో నీలోఫర్‌ కేఫ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలను పోలీసులు కాసేపు మూసివేయించారు.   

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు