Breaking News

ఎవరి ఆదేశాలతో ఎఫ్‌ఈఓకు డబ్బులిచ్చారు?

Published on Sat, 01/11/2025 - 01:18

సాక్షి, హైదరాబాద్‌: ‘ఫార్ములా–ఈ కారు రేసు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఈఓ (ఫార్ములా– ఈ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌)కు హెచ్‌ఎండీఏ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? నిధులు బదిలీ చేయాలని మిమ్మల్ని ఎవరు ఆదేశించారు? రేసు నిర్వహణ నిర్ణయాలను ఎవరెవరిని సంప్రదించి తీసుకునేవారు?’అని హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తాను ఉన్నతాధికారుల ఆదేశాలనే పాటించానని, వారు ఏది చెబితే అదే చేశానని ఆయన సమాధానమిచ్చినట్టు తెలిసింది. ఫార్ములా–ఈ కారు రేసు కేసులో ఏ–3గా ఉన్న బీఎల్‌ఎన్‌ రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 9.50 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి ఆయన చేరుకున్నారు.

ఏసీబీ అధికారులు ముందుగా సూచించిన మేరకు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను తీసుకువచ్చారు. ఏసీబీ సీఐయూ (సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ ) డీఎస్పీ మాజిద్‌ అలీఖాన్‌ బృందం బీఎల్‌ఎన్‌ రెడ్డిని విచారించింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో ఏ–1 మాజీ మంత్రి కేటీఆర్, ఏ–2 ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌ విచారణ సందర్భంగా సేకరించిన వివరాలు, దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు బీఎల్‌ఎన్‌ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది.

ప్రధానంగా బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌ఈఓ కంపెనీకి హిమాయత్‌నగర్‌లోని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లోని హెచ్‌ఎండీఏ అకౌంట్స్‌ నుంచి నగదు ఎందుకు పంపారన్న అంశంపైనే ప్రశ్నించినట్టు సమాచారం. ఫార్ములా ఈ రేస్‌ సీజన్‌ 9 కోసం మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రెండు విడతలుగా రూ.45.71 కోట్లు బదిలీ చేసినట్లు బీఎల్‌ఎన్‌ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. నిధుల బదిలీ కోసం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని పత్రాలను ఏసీబీ అధికారులకు ఆయన     అందించినట్టు సమాచారం. అవసరం మేరకు మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని బీఎల్‌ఎన్‌ రెడ్డికి ఏసీబీ అధికారులు సూచించినట్లు తెలిసింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)