Breaking News

CWC Meeting: అతిథుల కోసం 78 రకాల వంటకాలు.. నోరూరాల్సిందే!

Published on Sat, 09/16/2023 - 08:47

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయని.. ఈ క్రమంలో రాష్ట్ర కేడర్‌లో జోష్‌ నింపడం, బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ఇవ్వడం కోసం ఇక్కడ సమావేశాలు పెట్టారని చర్చ జరుగుతోంది. 

అతిథుల కోసం 78 రకాల వంటకాలు 
ఇక సీడబ్ల్యూసీ భేటీలకు వచ్చే నేత లకు తెలంగాణ ప్రత్యేక వంటకాలతోపాటు హైదరాబాదీ దమ్‌ బిర్యానీని వడ్డించనున్నారు. మొత్తంగా 78 రకాల వంటకాలను వడ్డించేలా పీసీసీ ఏర్పా ట్లు చేసింది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నిరకాల వంటలు, రుచులు ఉండేలా మెనూ సిద్ధం చేసింది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, వివిధ రాష్ట్రాల ఇతర సీనియర్లు వస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేక వంటకాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వంట మనుషులను రప్పించింది. 

►అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉగ్గాని, కిచిడీ, ఉప్మా, రాగి, జొన్న సంగటి, పాయ సూప్, ఖీమా రోటీ, మిల్లెట్‌ ఉప్మా, మిల్లెట్‌ వడ, ప్రూట్‌ సలాడ్‌ వంటివి వడ్డించనున్నారు. 

►మధ్యాహ్నం భోజనంలో హైదరాబాదీ దమ్‌ బిర్యానీ, హలీమ్, బగారా రైస్, కుర్మా, దాల్చా మటన్, స్పెషల్‌ చికెన్, మటన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, తలకాయ కూర, లివర్‌ ఫ్రై, తెలంగాణ స్పెషల్‌ మటన్‌ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చేపలు వడ్డిస్తారు. 

►శాకాహారుల కోసం పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు ఉండనున్నాయి.

►స్నాక్స్‌ ఐటమ్స్‌గా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, వివిధ రకాల సమోసాలు, కుడుములు, మురుకులు, ఉడికించిన మొక్కజొన్న, సకినాలు, గారెలు రుచి చూపించనున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)