Breaking News

నాలుగు పథకాలకు ఏటా రూ.45 వేల కోట్లు

Published on Mon, 01/27/2025 - 04:30

కొణిజర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, రైతుభరోసా పథకాలకు ఏటా రూ.45 వేల కోట్లు వెచ్చిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖర్చుకు వెరవకుండా సంక్షేమ పథకాల అమలులో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నగోపతిలో ఆదివారం ఆయన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. 

ఇటీవల గ్రామసభల్లో లక్షలాది దరఖాస్తులు అందగా, వాటిని క్రోడీకరించి ప్రతీ నిరుపేదకు లబ్ధి జరగాలనే లక్ష్యంగా రాష్ట్రంలోని 66 మండలాల్లో ఒక్కో గ్రామంలో లాంఛనంగా పథకాలు ప్రారంభించామని తెలిపారు. దీనిపై బురదజల్లే యత్నం చేస్తూ ‘ఎక్స్‌’లో పోస్టులు పెట్టిన మాజీమంత్రి కేటీఆర్‌ సంక్షేమ పథకాల ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు.

గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే.. ఇప్పుడు త మకు పని ఉండేది కాదని భట్టి తెలిపారు. రా­ష్ట్రం­లో ఇల్లు లేని ప్రతీ నిరుపేదకు గూడు కల్పించే వరకు పథకం కొనసాగుతుందని, రాబోయే ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తామని భట్టి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్, ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)