Breaking News

ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..

Published on Mon, 12/04/2023 - 09:22

హైదరాబాద్: శాసనసభ ఎన్నికలలో నోటా ఓట్లు కీలకమని మరోసారి రుజువైంది. బరిలోకి దిగిన అభ్యర్థులు నచ్చకపోతే నన్‌ ఆఫ్‌ ది ఎబౌ (నోటా) గుర్తును నొక్కే అవకాశం ఉండటంతో ఈసారి నోటాకు ఓట్లు బాగానే పడ్డాయి. గ్రేటర్‌లోని చాలా నియోజకవర్గాలలో మూడు ప్రధాన పారీ్టల తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది నోటాకే. అత్యధికంగా మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో 15,418 రాగా.. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 12,824 వచ్చాయి. హైదరాబాద్‌లో నోటాకు 16,222 ఓట్లు పోలయ్యాయి. 

అత్యధికం కుత్బుల్లాపూర్, అత్యల్పం నాంపల్లి.. 
అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో నోటాకు 4,079 ఓట్లు రాగా.. అత్యల్పంగా నాంపల్లిలో 544 ఓట్లొచ్చాయి. చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలే యాదయ్య గెలిచిన మెజారిటీ కంటే నోటా ఓట్లే ఎక్కువ ఉండటం కొసమెరుపు. ఇక్కడ యాదయ్య కాంగ్రెస్‌ అభ్యర్థి భీమ్‌ భరత్‌పై 268 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. నోటాకు వచి్చన ఓట్లు 1,423 కావడం గమనార్హం. యాకుత్‌పురలో 878 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎంఐఎం అభ్యర్థి జాఫర్‌ హుస్సేన్‌. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 704. 

నోటా ఓట్లు గతంలో కంటే తక్కువే.. 
అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్లు నోటా ఓట్లు తక్కువే పోలయ్యాయి. గత ఎన్నికలలో మూడు జిల్లాలతో కూడిన గ్రేటర్‌లో నోటాకు 44,935 ఓట్లు రాగా.. తాజా ఫలితాల్లో 471 తగ్గి నోటాకు 44,464 ఓట్లొచ్చాయి. గతంలో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో నోటాకు 17,078 ఓట్లు రాగా.. ఈసారి 16,222కు తగ్గాయి. రంగారెడ్డిలో గతంలో 13,242 ఓట్లు పోలవగా.. ఇప్పుడు 12,824 వచ్చాయి. మేడ్చల్‌–మల్కాజ్‌గిరిలో గతంలో 14,615 ఓట్లు రాగా.. ఈసారి 803 ఓట్లు ఎక్కువొచ్చాయి. తాజా ఫలితాల్లో నోటాకు 15,418 ఓట్లు వచ్చాయి. 


Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)