Breaking News

మహిళాభ్యుదయం కోసమే ‘4 ఈ సెంటర్‌’ 

Published on Thu, 03/02/2023 - 05:08

నాగోలు: మహిళల అభ్యున్నతి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని, మహిళాసాధికరతకు ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్‌ అన్నారు. బుధవారం రాత్రి నాగోలు డివిజన్‌ బండ్లగూడ అనంద్‌నగర్‌లో బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ మహిళా మోర్చా పాలసీ, రీసెర్చ్‌ ఇంచార్జి కాలంశెట్టి లయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (చదువు, ఉపాధి, వ్యవస్థాపకత, సాధికారత) 4 ఈ సెంటర్‌ను వనతి శ్రీనివాసన్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలను చదువు, ఉపాధి రంగాలలో ప్రోత్సహించాలని సూచించారు. వ్యవస్థాపకత, సాధికరత కోసం 4 ఈ సెంటర్‌ పనిచేస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లో రాణించేలా మహిళలను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిరంతరం ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సుకన్య సమృద్ధి పథకం, ఆయుష్మాన్‌ భారత్‌ తదితర పథకాలపై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. మహిళల అభ్యదయ కోసం తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా 4 సెంటర్‌ నాగోలులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, నాగోలు కార్పొరేటర్‌ చింతల అరుణ సురేందర్‌ యాదవ్, రాష్ట్ర ఇంచార్జి నళిని, రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్‌ విభాగం అధ్యక్షుడు సామ రంగారెడ్డి, గడ్డిఅన్నారం కార్పొరేటర్‌ ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి, నేతలు శ్యామల, గజం రాజ్యలక్షి్మ, బద్దం బాలకృష్ణగౌడ్, డప్పురాజు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)