Breaking News

నేటి నుంచి జాతీయ పుస్తక ప్రదర్శన

Published on Fri, 12/19/2025 - 05:54

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ 38వ జాతీయ పుస్తక మహోత్సవానికి ఎన్టీఆర్‌ స్టేడియం ముస్తాబైంది. పదకొండు రో జుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నా యి. శుక్రవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ అధ్యక్షుడు కవి యాకూబ్, కార్యదర్శి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం లక్షల మంది పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ఇటీవల కన్నుమూసిన ప్రముఖ కవి అందెశ్రీ (Andesri) ప్రాంగణంగా నామకరణం చేశారు. సాంస్కృతిక వేదికకు అనిశెట్టి రజిత పేరు పెట్టారు.

అలాగే ఈ ఏడాది చనిపోయిన జర్నలిస్ట్‌ స్వేచ్ఛ పేరిట మీడియా స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. మరో వేదికకు రచయిత కొంపల్లి వెంకట్‌గౌడ్‌ పేరు పెట్టనున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో ఈసారి 365 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం 350 స్టాళ్లను ఏర్పాటు చేయగా ప్రచురణ సంస్థల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈసారి స్టాళ్ల సంఖ్యను పెంచామని నిర్వాహకులు తెలిపారు. ఇందులో మీడియా కోసం 22 స్టాళ్లు, రచయితల కోసం 9 స్టాళ్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు.  

విద్యార్థులకు ఉచిత ప్రవేశం..
ప్రతీ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన (Book Fair) కొనసాగుతుంది. సాధారణ సందర్శకులకు రూ.10 ప్రవేశ రుసుము ఉంటుంది. కేజీ నుంచి పీజీ స్థాయి విద్యార్ధుల వరకు ఉచిత ప్రవేశ సదుపాయం కల్పించినట్లు బుక్‌ఫెయిర్‌ కమిటీ కార్యదర్శి వాసు తెలిపారు. గత సంవత్సరం సుమారు 12 లక్షల మంది సందర్శకులు పుస్తక ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం సుమారు 15 లక్షల మందికి పైగా సందర్శించే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)