Breaking News

నేటి నుంచి పుస్తక ప్రదర్శన

Published on Thu, 12/19/2024 - 09:16

కవాడిగూడ: హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఆధ్వర్యంలో 37వ జాతీయ పుస్తక ప్రదర్శన గురువారం సాయంత్రం ఎనీ్టఆర్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు ఇది కొనసాగనుంది. బుధవారం హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు యాకూబ్,  కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌ విలేకరులతో ఇక్కడ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను ప్రదర్శించనున్నారని తెలిపారు. ప్రతి ఇంటిలో పుస్తకం ఉండే లక్ష్యంతో బుక్‌ ఫెయిర్‌ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. 36 ఏళ్ల క్రితం 30 స్టాళ్లతో ప్రారంభమై పుస్తక ప్రదర్శన ప్రస్తుతం 350 స్టాళ్లతో  సాహితీ అభిమానులను, పుస్తక ప్రేమికులను ఆకట్టుకోనుందని తెలిపారు.  బాల సాహిత్యానికి ప్రాధాన్యమిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.  

విద్యార్థులకు ప్రవేశం ఉచితం..   
పుస్తక ప్రదర్శనలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వారి ఐడీ కార్డులు చూపించి ఉచిత ప్రవేశం పొందవచ్చని తెలిపారు.  

ఉచిత ఆరోగ్య శిబిరం.. నోరూరించే వంటకం  
తెలంగాణ రుచులతో ప్రత్యేక ఫుడ్‌ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్‌ఫెయిర్‌ సందర్శకుల కోసం ఈ ఏడాది ఉచిత ఆరోగ్య శిబిరంతో పాటు రెండు వీల్‌ చైర్లను అందుబాటులో ఉంచుతామన్నారు.   

సాంస్కృతిక ప్రదర్శనలు..   
ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. సమావేశంలో తెలుగు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, బుక్‌ఫెయిర్‌ ఉపాధ్యక్షులు శోభన్‌బాబు, బాల్‌రెడ్డి, ట్రెజరర్‌ నారాయణరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ సూరిబాబు, కె.సురేష్‌ పాల్గొన్నారు.  

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)