Breaking News

సాగర్‌ నుంచి 3.54 లక్షల క్యూసెక్కులు దిగువకు..

Published on Wed, 08/07/2024 - 08:04

నాగార్జునసాగర్‌/దోమలపెంట/సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం నుంచి భారీగా వరద నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం రాత్రి 20 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు మంగళవారం ఉదయం మరో రెండు గేట్లు తెరిచి మొత్తం 22 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు సాగర్‌ నీటిమట్టం 585.40 అడుగుల వద్ద నిల్వ సామర్థ్యం 298.5890కు చేరడంతో ఆరు గేట్లను ఐదు అడుగుల మేర, 16 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి దిగువకు 2,70,920 క్యూసెక్కుల నీరు వదిలారు.

మధ్యాహ్నం 2 గంటలకు వరద మరింత పెరగడంతో 22 గేట్లను పది అడుగుల పైకెత్తి 3,09276 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు ఇన్‌ఫ్లో 3,14,594 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 3,54,663కు పెంచారు. సాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుతం 585.10 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం జలాశయంలో 297.7235 టీఎంసీల నీరు ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా  3,11,790 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

కుడి, ఎడమ కాల్వలకు నీటి పెంపు..
సాగర్‌ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని పెంచారు. కుడి కాల్వకు 8,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఏఎమ్మార్పీకి 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. చెరువులు నింపేందుకు వరద కాల్వకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా అనుముల మండలం మారేపల్లి వద్ద కాల్వకు గండి పడటంతో మంగళవారం ఉదయం వరద కాల్వకు నీటిని నిలిపేశారు. మరోవైపు ఏఎమ్మారీ్పతో పరిధితోపాటు ఆయకట్టు ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, కుంటలు వాగులు ఎండిన నేపథ్యంలో ఏఎమ్మార్పీ కాల్వలకు నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని రైతులు కోరుతున్నారు.

పులిచింతల నుంచి 1.08 లక్షల క్యూసెక్కులు విడుదల
పులిచింతల ప్రాజెక్టు సగం నిండిపోవడం.. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పులిచింతలలోకి 3,71,605 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. ప్రాజెక్టులో 157.48 అడుగుల్లో 22.75 టీఎంసీలను నిల్వ చేస్తూ గేట్లు ఎత్తి దిగువకు 1,08,895 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. పులిచింతల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో.. బుధవారం ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న జలాలను గేట్లు ఎత్తి సముద్రంలోకి                  వదిలేయనున్నారు.

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)