Hyderabad: వీధుల్లో వ్యభిచారం!

Published on Fri, 10/25/2024 - 06:43

మూసాపేట: రాష్ట్రంలో వ్యభిచారం చట్టరీత్యా నేరం. దీంతో సైబరాబాద్‌ పోలీసులు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. కమిషనరేట్‌ పరిధిలో బస్టాప్‌లు, నిర్మానుష్య ప్రాంతాలలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని వీధుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుల ఆటకట్టించారు. గత నెల రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 53 మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్లను బైండోవర్‌ చేశారు. 

వ్యభిచారంపై నిఘా పెట్టేందుకు మానవ అక్రమ రవాణా విభాగం (ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్‌తో పాటు కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పోలీసులతో బాలానగర్‌ డీసీపీ కే సురేష్‌ కుమార్‌ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటికి కూకట్‌పల్లి ఏసీపీ కే శ్రీనివాస రావు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, 7 మంది ఎస్‌ఐలు, ఇద్దరు ఏఎస్‌ఐలు, 36 మంది కానిస్టేబుళ్లతో మొత్తం 49 మంది సిబ్బంది ఉంటారు.

 బుధవారం రాత్రి భాగ్యనగర్‌ బస్టాప్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ల పరిధిలో జాయింట్‌ ఆపరేషన్స్‌ నిర్వహించి 31 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్‌జెండర్లను బైండోవర్‌ చేశారు. బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టంలోని సెక్షన్‌–35 కింద నోటీసులు జారీ చేశారు. వీరిపై అనైతిక ట్రాఫిక్‌ (నివారణ) చట్టం–1956 కింద కూకట్‌పల్లిలో మూడు, కేపీహెచ్‌బీలో ఒక కేసు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన జాయింట్‌ ఆపరేషన్స్‌లోనూ 22 మందిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే.


 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)