Breaking News

మరో మూడు రోజులు వానలు

Published on Fri, 09/06/2024 - 04:48

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తాయని తెలిపింది. ఆరు జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు 
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ముసురు వాతావరణంతో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. భద్రాచలం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల మేర, మిగతా చోట్ల ఒకట్రెండు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాత్రివేళల్లో చలిగాలులు వీస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 32.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

రెండు జిల్లాల్లో వానలు డబుల్‌ 
నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి వర్షాలు సాధారణాన్ని దాటిపోయాయి. సీజన్‌కు సంబంధించి ఇప్పటి (సెపె్టంబర్‌ 5)వరకు 60.32 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవాల్సి ఉండగా.. 40శాతం అధికంగా 84.72 సెంటీమీటర్లు కురిసింది. వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో సాధారణం కంటే రెండింతలకుపైగా వర్షాలు కురిసినట్టు తెలంగాణ ప్రణాళిక విభాగం గణాంకాలు చెప్తున్నాయి. వనపర్తి జిల్లాలో 37.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 79.14 సెంటీమీటర్లు, అంటే 114 శాతం అధికంగా వర్షం కురిసింది.

నారాయణపేట జిల్లాలో 37.08 సెం.మీ. సాధారణ వర్షపాతానికిగాను 77.15 సెంటీమీటర్లు (108 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో ఆరు జిల్లాలు వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. మిగతా జిల్లాల్లో అధిక వర్షం కురిసింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)