Breaking News

నల్లగొండలో తీగ లాగితే సిటీ డొంక కదిలింది!

Published on Tue, 10/17/2023 - 07:17

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ఆదివారం చిక్కిన హవాలా గ్యాంగ్‌ తీగ లాగితే... హైదరాబాద్‌లోని ఉత్తర మండల కేంద్రంగా దందా చేస్తున్న సూత్రధారులు చిక్కారు. నలుగురిని అదుపుతోకి తీసుకుని, వారి నుంచి రూ.2.09 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నట్లు టాస్‌్కఫోర్స్‌ ఓఎస్డీ పి.రాధా కిషన్‌ రావు సోమవారం వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన దినేష్‌ కుమార్, సచిన్‌ కుమార్‌ నగరానికి వలసవచ్చారు. వీరు ఉత్తరాదికి చెందిన హవాలా ముఠాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి ఆదేశాల మేరకు సిటీలోని వివిధ ప్రాంతాలతో పాటు రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు నగదు సరఫరా చేస్తున్నారు. 

తమ వద్ద పని చేసే విపుల్‌కుమార్‌ భాయ్, అమర్‌ సిన్హా జాలలకు రూ.3.04 కోట్లు అప్పగించారు. తమ కారు కింది భాగంలో ప్రత్యేక అర ఏర్పాటు చేసుకున్న వీరు అందులో నగదు నింపారు. ఆ మొత్తాన్ని చెన్నై తరలిస్తుండగా.. ఆదివారం నల్లగొండ జిల్లా, దామరచర్ల మండలం, వాడపల్లి వద్ద పోలీసులకు చిక్కారు. విచారణలో సూత్రధారులు నగరంలో ఉన్నట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.సైదులు నేతృత్వంలో ఎస్సైలు బి.అశోక్‌రెడ్డి, పి.గగన్‌దీప్, జి.నవీన్‌తో కూడిన బృందం రంగంలోకి దిగింది.

 లోతుగా ఆరా తీయగా దినేష్‌ కుమార్‌ పాటిల్, సచిన్‌కుమార్‌ విష్ణుభాయ్‌ పాటిల్, జితేందర్‌ పాటిల్, శివ్‌రాజ్‌ నవీన్‌ భాయ్‌ మోడీ, మీట్‌ రాకేష్‌ పాటిల్, తఖోర్‌ నాగ్జీ ఈ హవాలా దందాలో కీలకమని తేలింది. నల్లగొండ జిల్లాలో తమ నగదు చిక్కిన విషయం తెలుసుకున్న వీరు తమ వద్ద ఉన్న నగదును బ్యాగుల్లో పెట్టి మరోప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. 

ఈ విషయం గుర్తించిన టాస్‌్కఫోర్స్‌ టీమ్‌ గాం«దీనగర్‌ ప్రాంతంలో నిఘా వేసింది. అటుగా వెళ్తున్న కారు, ద్విచక్ర వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా రూ.2.09 కోట్లు లభించాయి. నిందితులతో పాటు నగదును తదుపరి చర్యల నిమిత్తం గాం«దీనగర్‌ పోలీసులకు అప్పగించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)