Breaking News

సమయం లేదు మిత్రమా..

Published on Sun, 01/04/2026 - 01:09

సాక్షి, హైదరాబాద్‌:  ‘సమయం మించిపోతోంది మిత్రమా..గడువులోగా వచ్చి లొంగిపోండి. ప్రభుత్వాలు, పోలీసుల తరఫున ఏ సహకారం అందాలో అది పూర్తిగా అందిస్తాం..’అని మావోయిస్టులకు డీజీపీ బి.శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ పీపుల్స్‌ గెరిల్లా లిబరేషన్‌ ఆర్మీ (పీజీఎల్‌ఏ) పతనం అంచుకు చేరిందని, ప్రస్తుతం కేవలం 66 మంది మాత్రమే మిగిలారని తెలిపారు. ఇప్పటివరకు పట్టుబడిన మావోయిస్టుల నుంచి అత్యంత కీలక సమాచారం తెలిసిందని, వారు మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన 52 మంది అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నట్టు రికార్డులు ఉన్నా..వాస్తవానికి 17 మంది మాత్రమే ఉన్నట్టు తెలిసిందని చెప్పారు.

మడావి హిడ్మా అనుచరుడు పీజీఎల్‌ఏ బెటాలియన్‌ కమాండర్‌ బడ్సె సుక్క అలియాస్‌ దేవా (బర్సె దేవా), దర్శన్, మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేష్, ఆయన భార్య అడ్లూరి ఈశ్వరి అలియాస్‌ రంకో సహా మొత్తం 20 మంది మావోయిస్టులు శనివారం డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. రెండు అత్యాధునిక లైట్‌ మెషీన్‌ గన్‌ (ఎల్‌ఎంజీ)లు సహా మొత్తం 48 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.

రూ.20.3 లక్షల నగదు కూడా అప్పగించారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీ విజయ్‌కుమార్, శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్‌ భగవత్, ఆపరేషన్స్‌ అదనపు డీజీ అనిల్‌కుమార్, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి శివధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సహా మరే ఇతర రాష్ట్రాల పోలీస్‌ చరిత్రలోనూ ఒకే లొంగుబాటులో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలు మావోయిస్టులు విడిచిపెట్టడం ఇదే మొదటిసారి (రికార్డు) అని తెలిపారు.

మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ
‘అంతర్గత కలహాలు, ఆరోగ్య సమస్యలు, ప్రస్తుతం అడవుల్లో ఉండలేని పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీలకు మావోయిస్టులు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే 576 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మిగిలి ఉన్న అగ్రనేతలు సహా అందరూ వీలైనంత త్వరలో జనజీవన స్రవంతిలోకి కలుస్తారని ఆశిస్తున్నాం. గెరిల్లా ఆపరేషన్లను ముందుండి నడిపిన దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి జిల్లా కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ లొంగుబాటుతో ఆ పార్టీ రాష్ట్ర కమిటీపై పెద్ద దెబ్బ పడినట్లయింది.

రాజిరెడ్డి 1997లో ఉద్యమంలో చేరాడు. ప్రస్తుతం లొంగిపోయిన 20 మందికి మొత్తంగా రూ.1.81 కోట్ల రివార్డు అందిస్తాం. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున డీడీలు ఇస్తున్నాం..’అని డీజీపీ తెలిపారు. రాజిరెడ్డి మాట్లాడుతూ.. మారిన పరిస్థితులు, సాంకేతికత కారణంగా సాయుధ పోరాటం చేయడం కష్టమైందని చెప్పారు. అయితే తాను అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నట్టు తెలిపారు.

మిగిలిన వారు సైతం లొంగిపోవాలని సూచించారు. కాగా 2 ఎల్‌ఎంజీలతో పాటు అమెరికాలో తయారైన కోల్ట్‌ రైఫిల్, ఇజ్రాయెల్‌ దేశంలో తయారైన టవర్‌ రైఫిల్, 8 ఏకే 47లు, 10 ఇన్సాస్‌లు, 8 ఎస్‌ఎల్‌ఆర్‌ (సెల్ఫ్‌ లోడింగ్‌ రైఫిల్‌)లు, 4 బీజీఎల్‌ (బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంచర్‌)లు, 11 సింగిల్‌ షాట్‌లు, రెండు గ్రనేడ్లు, ఒక ఎయిర్‌ గన్, 93 మ్యాగ్జైన్‌లు, 2,206 తూటాలు మావోయిస్టులు అప్పగించారు.   

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)