Breaking News

Ranga Reddy: కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్‌

Published on Tue, 04/15/2025 - 11:06

రంగారెడ్డి జిల్లా: మేనమామ పెళ్లి వేడుకలకోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ మృత్యువాతపడ్డారు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్‌ పరిధిలోని దామరగిద్దలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దామరగిద్దకు చెందిన తెలుగు జంగయ్య, అనసూయల కుమారుడు రాంబాబు వివాహం ఈనెల 30న జరగనుంది. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా రాంబాబు అక్కాచెల్లెళ్లైన సీతారాంపూర్‌కు చెందిన ఉమారాణి, పామెన గ్రామానికి చెందిన జ్యోతి తమ పిల్లలను తీసుకుని రెండు రోజుల క్రితం దామరగిద్దకు వచ్చారు.

 ఇంటికి రంగులు వేసే పనులు కొనసాగుతుండటంతో పిల్లలంతా కలసి బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఉమారాణి చిన్న కూతురు అభినయశ్రీ (4), జ్యోతి చిన్న కూతురు తన్మయశ్రీ(5) ఇంటి ఎదుట పార్క్‌ చేసి ఉన్న కారులోకి ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత పిల్లలు డోర్లు వేసుకోవడంతో అవి లాక్‌ అయ్యాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పిల్లలందరూ ఒకే చోట ఆడుకుంటున్నారని భావించిన కుటుంబ సభ్యులు వారివారి పనుల్లో మునిగిపోయారు. 

సుమారు రెండు గంటలు గడిచిన తర్వాత అభినయశ్రీ, తన్మయశ్రీ కనిపించకపోవడంతో అంతా వారికోసం వెతుకుతుండగా కారు డోర్లు తీసి చూశారు. ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు పిల్లలు మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతి ఘటన దామరగిద్దతోపాటు సీతారాంపూర్, పామెన గ్రామాల్లో విషాదం నింపింది. పిల్లల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు అందరినీ కలచి వేశాయి.  

 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)