Breaking News

రిమోట్‌ కోసం తమ్ముడితో గొడవ పడి.. బాలిక ఆత్మహత్య

Published on Tue, 07/01/2025 - 10:56

సైదాబాద్‌: టీవీ రిమోట్‌ కోసం తమ్మడితో గొడవ పడిన ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వినయ్‌నగర్‌ కాలనీకి చెందిన మల్లిక, వెంకన్న దంపతులకు ముగ్గురు సంతానం. ఇటీవల ఇంటర్‌ పూర్తి చేసిన వారి పెద్ద కుమార్తె ధృతి చందన (16) ఆదివారం రాత్రి తన తమ్ముడుతో కలిసి టీవీ చూస్తుండగా రిమోట్‌ విషయమై  ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన ధృతి  తమ్ముడిని కొట్టి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. 

ఆ తర్వాత కొద్ది సేపటికి ఇంటికి వచి్చన ఆమె తండ్రి వెంకన్న   గది తలుపులు కొట్టినా ధృతి స్పందించకపోవడంతో తలుపులు పగుల కొట్టి లోపలికి వెళ్లి చూడగా ధృతి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దించి స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)