Breaking News

ఐబొమ్మ రవికి 14రోజుల రిమాండ్

Published on Wed, 11/26/2025 - 16:03

సాక్షి హైదరాబాద్: ఐబొమ్మ రవికి  నాంపల్లి కోర్టు  14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీ సోమవారం ముగిసింది. కస్టడీలో అతని నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ సినీ పైరసీ ఐబొమ్మ రవి ఒక్కడే చేశాడని అలా రూ. 100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇందులో రూ.30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా బేరమాడి మరీ సినిమాలు కొనుగోలు చేశాడు. మూవీపై క్లిక్‌ చేయగానే.. 15 యాడ్స్‌కు డైరెక్ట్‌ లింక్‌ అయ్యేలా ఏర్పాటు చేశాడని విచారణలో పోలీసులు గుర్తించారు.

కాగా, రవిపై చాలా సెక్షన్లతో కేసులు పెట్టారని.. అందులో రెండు మాత్రమే వర్తిస్తాయని అంటున్నారు అడ్వకేట్ సీవీ శ్రీనాథ్ . రవి ఐదు రోజుల కస్టడీ రెండు రోజుల క్రితం ముగిసిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడా జైలుకు తరలించారు. అయితే రవికి బెయిల్‌  వస్తుందని ఆయన తరుఫు లాయర్‌  శ్రీనాథ్ భావించినప్పటికీ, మరో 14 రోజుల పాటుజ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది  నాంపల్లి కోర్టు.

ఇదిలా ఉంచితే, వీటితో పాటు రవిపై పోలీసులు మరో మూడుకేసుల్లో పీటీ వారెంట్ జ్యారీ చేశారు. ఈ వారెంట్లపై విచారించిన కోర్టు ఐబొమ్మ రవిని మరోసారి విచారించడానికి 3 రోజుల కస్టడీకి పోలీసులకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో రేపు చంచల్ గూడ జైలులో ఐబొమ్మ రవిని  పోలీసులు అదుపులోకి  తీసుకోనున్నారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)