Breaking News

పెళ్లి చేస్తారా? చస్తారా : 13ఏళ్ల బాలిక గలాటా

Published on Thu, 10/17/2024 - 13:09

బషీరాబాద్‌: పదహారేళ్ల బాలిక తాను ప్రేమించిన యువకుడితో వివాహం చేయాలని తల్లితో గొడవకు దిగింది. ఇప్పుడే పెళ్లి ఏంటని తల్లి మందలించడంతో.. నేరుగా తాను ఇష్టపడ్డ యువకుడి ఇంటికి వెళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బషీరాబాద్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదివి, ప్రస్తుతం టైలరింగ్‌ చేస్తోంది. ఇదే ఊరికి చెందిన ప్రశాంత్‌(21) అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

ఇదే విషయాన్ని సదరు బాలిక గత మంగళవారం తల్లి లక్ష్మికి తెలియజేసింది. దీంతో ‘తండ్రిలేని బిడ్డవు.. ఇంకా నీకు పెళ్లి వయసు రాలేదు.. కొంత కాలం ఆగు బిడ్డా’ అని సముదాయించింది. ఇది నచ్చని బాలిక తల్లితో వాగ్వాదానికి దిగింది. నువ్వు చేయకపోతే నేనే చేసుకుంటా అని చెప్పి ప్రశాంత్‌ ఇంటికి వెళ్లింది. ఈ ఘటనతో అబ్బాయి కుటుంబ సభ్యులు సైతం నిర్ఘాంతపోయారు. బాలిక తల్లి చైల్డ్‌లైన్‌ 1098కు కాల్‌ చేసి జరిగిన విషయం చెప్పింది. బుధవారం ఉధయం బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు పెళ్లిని అడ్డుకోవాలని కోరింది. 

తన బిడ్డను మందలిస్తే ప్రశాంత్‌ తనను బెదిరించాడని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం లీగల్‌ అధికారి నరేష్‌, ఎస్‌ఐ గఫార్‌ సిబ్బందితో యువకుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనంతరం పోలీసులు ప్రశాంత్‌ను పీఎస్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాల్య వివాహం చెల్లదని, చట్టప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. పద్దెనిమిదేళ్లు ఏళ్లు నిండిన తర్వాత అదే యువకుడితో పెళ్లి చేస్తామని బాలికకు భరోసా ఇచ్చారు. అప్పటి వరకు చదువుకోవాలని వికారాబాద్‌లోని సఖి కేంద్రానికి తరలించారు.

 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)