Breaking News

Chilkur: చిలుకూరులో 1000 ఏళ్ల నాటి శివాలయం..

Published on Sun, 03/19/2023 - 07:53

సాక్షి, హైదరాబాద్‌: చిలుకూరు అనగానే అందరికీ బాలాజీ దేవాలయం గుర్తుకొస్తుంది. హైదరాబాద్‌ నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అమెరికా వెళ్లాలనుకునే యువత ప్రదక్షిణలతో నిత్యం ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. వీసా బాలాజీ అంటూ వారు పిలుచుకుంటుంటారు. చిలుకూరు బాలాజీ దేవాలయం చేరువలోనే మరో అత్యంత పురాతన శివాలయం ఉందని, ఈ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూటుల కాలం నాటిదని తాజాగా చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు.

స్థానికులు దానికి సున్నం వేసి పూజాదికాలు నిర్వహిస్తున్నప్పటికీ, అది బాగా శిథిలావస్థకు చేరుకుంది. తాజాగా శివనాగిరెడ్డి ‘ప్రిజర్వ్‌ హెరిటేజ్‌ ఫర్‌ పోస్టెరిటీ’కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని చారిత్రక ఆనవాళ్లపై పరిశోధించారు. ఈ సందర్భంగా ఈ శివాలయాన్ని పరిశీలించి, నిర్మాణ శైలి, అందులోని విగ్రహాల శైలి ఆధారంగా అది వెయ్యేళ్ల క్రితంనాటిదని తేల్చారు. ఆలయ అధిష్టానం ఇప్పటికే భూమిలోకి కూరుకుపోయిందని, ఆలయ రాళ్ల మధ్య పగుళ్లేర్పడి విచ్చుకుపో­తున్నాయని, శిఖరభాగంలోని రాళ్లు దొర్లి­పోతున్నాయని పేర్కొన్నారు. 9–10 శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. 

జైన బసదిగా విలసిల్లిన గ్రామం 
వేములవాడ చాళుక్యుల కాలంలో ఈ గ్రామం జైన బసదిగా విలసిల్లిందని, ఇక్కడ అద్భుత జైన నిర్మాణాలుండేవని, ఇక్కడి కొన్ని శిల్పాలు ప్రస్తుతం గోల్కొండలోని ఖజానా బిల్డింగ్‌ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయని, ఇప్పటికీ గ్రామంలోని చాలా ప్రాంతాల్లో జైన శిల్పాలు కనిపిస్తున్నాయని శివనాగిరెడ్డి చెప్పారు. రాష్ట్రకూటుల శైలి శివాలయం పక్కన కూడా జైన శిల్పముందన్నారు. గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న భైరవ, వీరుల, నాగదేవత, భక్తురాలి శిల్పాలను సరిగ్గా ప్రతిష్టించాలని, చెరువుకట్ట వద్ద ఉన్న పురాతన మండపాన్ని కూడా పునరుద్ధరించాలని సూచించారు.
చదవండి: మినరల్‌ వాటర్‌.. మిల్లెట్‌ భోజనం!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)